OnePlus 16 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తున్న వన్‌ప్లస్.. తన తదుపరి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ OnePlus 16కు సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా కెమెరా విభాగంలో భారీ అప్‌గ్రేడ్‌తో ఈ ఫోన్ రాబోతోంది. కంపెనీ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ 16లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనుంది. దీనికి తోడు మరో రెండు 50MP కెమెరాలు వెనుక భాగంలో అందుబాటులో ఉండనున్నాయి.
200MP మెయిన్ కెమెరా
వన్‌ప్లస్ 16లో 200MP ప్రైమరీ కెమెరాను 1/1.4-అంగుళాల సెన్సార్‌తో అందించనున్నారు. ఈ కెమెరా f/1.6 అపెర్చర్‌తో పనిచేయనుంది. దీంతో తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. కెమెరా వ్యవస్థలో భాగంగా Oppo అభివృద్ధి చేసిన Lumo ఇమేజింగ్ ఇంజిన్, Lumo కలర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ను కూడా వన్‌ప్లస్ తీసుకొస్తోంది.
50MP అల్ట్రావైడ్, టెలిఫోటో
ప్రైమరీ కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్ కెమెరాను అందించనున్నారు. ఇది 116 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో పనిచేస్తుంది. ఇక టెలిఫోటో కెమెరా కూడా 50MP రిజల్యూషన్‌తో రానుంది. ఇందులో Sony IMX882 సెన్సార్ను ఉపయోగించనున్నారు. ఈ కెమెరా 3X ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే గత మోడల్ OnePlus 15లోని 3.5X ఆప్టికల్ జూమ్‌తో పోలిస్తే ఇది కొంత తగ్గడం గమనార్హం.
50MP సెల్ఫీ కెమెరా
సెల్ఫీ కెమెరా విషయంలో మాత్రం వన్‌ప్లస్ భారీ అప్‌గ్రేడ్ చేసింది. OnePlus 15లో ఉన్న 32MP ఫ్రంట్ కెమెరా స్థానంలో ఇప్పుడు 50MP సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. అలాగే కెమెరా సిస్టమ్‌లో Open Gate సపోర్ట్ కూడా ఉండనుంది.
నాలుగు స్టోరేజ్ వేరియంట్లు
వన్‌ప్లస్ 16ను మూడు కలర్ ఆప్షన్లలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. Tomorrow’s Star, Martian Masterpiece, Dark Forest కలర్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. స్టోరేజ్ పరంగా నాలుగు వేరియంట్లు ఉండనున్నాయి.
12GB RAM + 256GB స్టోరేజ్
12GB RAM + 512GB స్టోరేజ్
16GB RAM + 512GB స్టోరేజ్
16GB RAM + 1TB స్టోరేజ్
Snapdragon 8 Elite Gen 6 చిప్
పనితీరు పరంగా కూడా వన్‌ప్లస్ 16లో కీలక అప్‌గ్రేడ్‌లు ఉండనున్నాయి. ఫోన్‌లో తాజాగా ప్రకటించిన Qualcomm Snapdragon 8 Elite Gen 6 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు వన్‌ప్లస్ వెల్లడించింది. ఈ చిప్ 2nm తయారీ ప్రక్రియ ఆధారంగా రూపొందించబడినట్లు కంపెనీ పేర్కొంది.
ఫోన్ డిజైన్ పరంగా ఫ్లాట్ డిస్‌ప్లే, సన్నని బెజెల్స్‌తో మినిమలిస్ట్ లుక్‌ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. BOE తయారు చేసిన 165Hz డిస్‌ప్లే ఉండనుందని, గేమింగ్ మోడ్‌లో ఇది 185Hz రిఫ్రెష్ రేట్‌కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అలాగే సెప్టెంబర్ 28న జరగనున్న OnePlus Game Conference 2026లో ఫోన్ పనితీరుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 16ను అక్టోబర్‌లో చైనా మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. కెమెరా, ప్రాసెసర్, డిస్‌ప్లే వంటి అంశాల్లో అప్‌గ్రేడ్‌లతో వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది.