The Paradise: రాడ్ సినిమా.. చెత్త సినిమా.. సోది సినిమా.. ఈ మాత్రం దానికి మూడు గంటలు అవసరమా.. పైగా విపరీతమైన రక్తం.. తట్టుకోలేని స్థాయిలో హింస.. బీ గ్రేడ్ స్థాయిలో కాయదులోహర్ అందాల ప్రదర్శన.. మోహన్ బాబు పాత్ర పేలవం.. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది.. ఇదిగో ఇలా సాగిపోతోంది నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా పై నెగిటివ్ ప్రాప గండ..
వాస్తవానికి ఈ సినిమా అంత చెత్తగా ఉందా.. మరి దారుణంగా ఉందా… టాక్సిక్ లాంటి రాడ్ రంబోలా నా.. కంప్లీట్ యాక్టర్ లాంటి నాని.. నాచురల్ పెర్ఫామెన్స్ చూపించే నాని.. ఇలాంటి సినిమా ఎలా తీశాడు.. కథ విషయంలో.. కథనం విషయంలో జాగ్రత్తగా ఉండే నాని ఇలాంటి తప్పటడుగులు వేయడం సాధ్యమేనా.. పైగా శ్రీకాంత్ దర్శకత్వంలో దసరా లాంటి సినిమా లో నటించిన తర్వాత నాని మరి ఇంత చెత్త సినిమాలో నటించాడా.. ఇలాంటి అనుమానాలనే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఒక పద్ధతి ప్రకారం.. ది ప్యారడైజ్ సినిమా మీద నెగటివ్ ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ పాత్రను ఇందులో చాలామంది తప్పు పడుతున్నారు. అసలు కెసిఆర్ పాత్ర ను బలవంతంగా చూపించడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇలా ఎవరికివారు విశ్లేషణలు చేస్తున్నారు. ఒకరకంగా ది ప్యారడైజ్ సినిమా మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా రా అండ్ రస్టిక్ లాగా ఉంటుందని మేకర్స్ చెబుతూనే ఉన్నారు. గుర్తింపు కోసం ఒక జాతి చేసే పోరాటం.. దాని వెనుక ఉన్న సంఘర్షణ మొత్తంగా ఈ కథ అని దర్శకుడు అంటూనే ఉన్నారు. కానీ కొందరు పనిగట్టుకుని చిత్రం మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారు. ఒక సినిమా నచ్చకపోతే చూసిన వాళ్ళు చెప్పాలి. అంతేగాని విశ్లేషకులు ముసుగులో ఉన్న వాళ్ళు విషం చిమ్మడమే ఇక్కడ అసలైన విషాదం.. సినిమాలో హీరోయిన్ పాత్ర.. మోహన్ బాబు పాత్ర ను కొన్ని సన్నివేశాల్లో మినహా.. మిగతా అన్నిట్లోనూ దర్శకుడు బాగానే రాసుకున్నాడు. ప్రాపర్ గానే ఎగ్జిక్యూషన్ చేశాడు. కానీ ఆ బాగా లేని సన్నివేశాలనే కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. అందువల్లే ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది.
వాస్తవానికి ఈ సినిమాలో తీసిపారేసే సన్నివేశాలు లేవు. అలాగని చెత్త కథ కూడా కాదు. బలమైన కథనం లేదని కాదు. అని బాగానే ఉన్నాయి. కాకపోతే హై రేంజ్ అంచనాలతో వెళ్తే మాత్రం సినిమా అంతగా సాటిస్ఫై చేయదు. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగానే ఉంది. కాకపోతే థియేటర్లలో సౌండ్ అధికంగా పెట్టడం వల్ల కొన్ని సందర్భాలలో నాని చెప్పిన డైలాగులు అర్థం కాదు. సౌండ్ మిక్సింగ్ లో బేస్ అధికంగా వాడినట్టు కనిపిస్తోంది. అందువల్లే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా అర్థం కాదు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం.. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం.. క్లైమాక్స్ అదరగొడతాయి. అయితే హీరోయిన్ ను చూపించిన తీరు.. మోహన్ బాబు పాత్ర ముగించిన తీరు అంతగా జనాలకు డైజెస్ట్ కాదు. కాకపోతే కొన్ని సన్నివేశాలలో శ్రీకాంత్ తన పని తీరును కనపరిచాడు. తనను ఎందుకు రా అండ్ రస్టిక్ అంటారో నిరూపించాడు.. ఈ స్థాయిలో ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. కొన్ని లో లను మాత్రమే భూతద్దం పెట్టి చూస్తున్నారు.
View this post on Instagram
సినిమాను సినిమా లాగా చూడండి. ప్యారడైజ్ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఆపండి. @odela_srikanth @NameisNani @11Lohar @KeerthyOfficial #paradise @themohanbabu #sampurneshbabu pic.twitter.com/sfAH5decrc
— ఎనబోతుల భాస్కర్ (@bhasamudra) September 24, 2026