YSRCP: అధికారం కోల్పోయిన పార్టీ.. అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రజలకు మంచి చేస్తామనే భరోసా కల్పించాలి. అధికార పార్టీ చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వాస్తవానికి అధికార పార్టీ కంటే అధికారం లేని పార్టీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం.. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం.. ప్రభుత్వాన్ని ఎదిరించడం అనేవి ప్రజాస్వామ్యం కల్పించిన బలమైన హక్కులు.
వైసిపి విఫలమవుతోంది
వాస్తవానికి వీటిని అమలు చేయడంలో.. భుజానికి ఎత్తుకోవడంలో వైసిపి విఫలమవుతోంది. అందువల్లే ఈ స్థాయిలో ఆ పార్టీ ఏపీలో ప్రజలనుంచి తీవ్రస్థాయిలో నిరసనను మూట కట్టుకుంటున్నది. అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ టీచర్లను బానిసల మాదిరిగా చూసింది వైసిపి. వారికి లిక్కర్ షాప్లలో డ్యూటీలు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మెగా డీఎస్సీ నిర్వహించింది. చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశము కల్పించింది. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ సొంత మీడియాలో కథనాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. కొంతమంది పెయిడ్ విశ్లేషకులను మైక్ ముందుకు తీసుకొచ్చి అడ్డగోలుగా ప్రచారం చేసింది. వాస్తవానికి ఇవన్నీ కూడా సత్యదూరాలు. ఎందుకంటే వీటిలో గనక పస ఉంటే కచ్చితంగా కోర్టు తప్పు పట్టేది. ప్రభుత్వం మీద ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్న వాళ్ళు ఇంతవరకు కోర్టులకు వెళ్లింది లేదు. కోర్టులలో కూడా ఈ కేసులు నిలవలేదు.
మెజారిటీ నాయకులు రౌడీషీటర్లు
పైగా ఇటీవల వైసిపి ఆధ్వర్యంలో శాప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ ధర్నాలో పాల్గొన్న వాళ్లలో మెజారిటీ నాయకులు రౌడీషీటర్లు.. ఇతర కేసులు ఉన్న వాళ్ళని టిడిపి నేతలు చెబుతున్నారు. ఏకంగా 40 మంది రౌడీ షీటర్లు.. 71 మంది ట్రబుల్ మాంగర్స్.. 91 మంది పాత క్రిమినల్ రికార్డులు ఉన్న వారిని పోలీసులు చెబుతున్నారు. కంచికచర్ల ప్రాంతానికి చెందిన మార్త శ్రీనివాస్ మీద 15 కేసులు.. వేమ సురేష్ బాబు మీద 14 కేసులు.. తెనాలి ప్రాంతానికి చెందిన గద్దేటి సురేంద్ర మీద 12 కేసులు.. దేవినేని అవినాష్ మీద 13 కేసులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇన్ని కేసులు ఉన్నవాళ్లు ఈ ధర్నా వెనుక ఉండి హింసను ప్రేరేపించారని టిడిపి నేతలు అంటున్నారు. అయితే ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసు అధికారులు వీడియోలు తీశారు. శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించారు. సీసీటీవీలు.. సోషల్ మీడియా వీడియోలు.. మీడియా ఛానల్స్ దృశ్యాలను విశ్లేషించి సుమారు 260 మంది ముఖాలను.. వారికి అదరికలను అత్యంత స్పష్టంగా గుర్తించారు. ఇందులో 220 నుంచి 230 మంది మీద డిజిటల్ సాక్షాలు ఉన్నాయని.. చట్టపరమైన ఆధారాలు సిద్ధం చేశామని అధికారులు అంటున్నారు. ఇప్పటికే 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారిని కూడా పోలీసులు గాలిస్తున్నారు.. దాదాపు ముగ్గురు మాజీ మంత్రులు.. 8 మంది ఎమ్మెల్సీలు.. ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు కలిసి రౌడీ మూకల వెనక నిలబడి డ్రామాలు ఆడారని టిడిపి నేతలు అంటున్నారు. పోలీసులు పకడ్బందీ ఆధారాలతో పట్టుకోవడంతో ఇప్పుడు వారికి ముఖాలు చూపించే నైతికత లేకుండా పోయిందని టిడిపి నేతలు అంటున్నారు.
View this post on Instagram