Homeఅంతర్జాతీయంSCO Summit: మోదీకి పాక్‌ ఆహ్వానం.. ఉగ్రదేశానికి వెళ్తారా మరి?

SCO Summit: మోదీకి పాక్‌ ఆహ్వానం.. ఉగ్రదేశానికి వెళ్తారా మరి?

SCO Summit: షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) వేదికపై భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. త్వరలో పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న ఎస్‌సీవో సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని పాకిస్తాన్‌ అధికారికంగా స్పష్టం చేసింది. ద్వైపాక్షిక ఉద్రిక్తతల మధ్య బహుపక్ష వేదికపై మోదీ ఎలా వ్యవహరిస్తారు అనేది ఆసక్తికరం. తప్పనిసరి ఆహ్వానం పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పినట్లు, సభ్య దేశాల అన్ని నాయకులకు ఆహ్వానం పంపడం అతిథి దేశం విధి. చైనా, రష్యా, […]

SCO Summit: షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) వేదికపై భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. త్వరలో పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న ఎస్‌సీవో సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని పాకిస్తాన్‌ అధికారికంగా స్పష్టం చేసింది. ద్వైపాక్షిక ఉద్రిక్తతల మధ్య బహుపక్ష వేదికపై మోదీ ఎలా వ్యవహరిస్తారు అనేది ఆసక్తికరం.

తప్పనిసరి ఆహ్వానం
పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పినట్లు, సభ్య దేశాల అన్ని నాయకులకు ఆహ్వానం పంపడం అతిథి దేశం విధి. చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్‌ సహా పది దేశాలు ఉన్న ఈ సంస్థలో అన్ని సభ్యులను సమానంగా చూడాలని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి భారత్‌ను మినహాయించడం సాధ్యం కాదు. 2027లో ఇస్లామాబాద్‌లో ఈ సమ్మిట్‌ జరుగుతుంది. పాకిస్తాన్‌ 2026, సెప్టెంబర్‌లో ఎస్‌సీవో అధ్యక్షత చేపట్టనుంది.

గత అనుభవాలు ఇలా..
గతంలోనూ ఎస్‌సీవో వేదికల్లో భారత్‌–పాక్‌ అధికారులు కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2024లో ఇస్లామాబాద్‌లో జరిగిన సమ్మిట్‌కు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ హాజరయ్యారు. అయితే ప్రధాని స్థాయిలో పర్యటన అనేది వేరే విషయం. ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్న నేపథ్యంలో మోదీ హాజరవుతారా లేదా అనేది భవిష్యత్తులోనే స్పష్టమవుతుంది. బహుపక్ష వేదికల్లో సహకారం కొనసాగించడం, ద్వైపాక్షిక సమస్యలను వేరుగా ఉంచడం రెండు దేశాల వైఖరి.

ఆసియాన్‌ సమావేశాల్లో భేటీ..
మనీలాలో నవంబర్‌లో జరగనున్న ఆసియాన్‌ సమావేశాల్లో జైశంకర్‌తో పాక్‌ విదేశాంగ మంత్రి భేటీకి ఎలాంటి అభ్యర్థన రాలేదని పాక్‌ ప్రతినిధి చెప్పారు. ఇది ప్రస్తుతం ద్వైపాక్షిక స్థాయిలో ఎలాంటి చురుకైన సంప్రదింపులు లేవని సూచిస్తోంది. ఎస్‌సీవో వంటి బహుపక్ష వేదికల్లోనే పరిమిత పరస్పర చర్యలు జరుగుతున్నాయని అర్థం.

ఉగ్ర దేశానికి మోదీ వెళ్తారా?
ఎస్‌సీవో సమావేశానికి పాకిస్తాన్‌ తన దౌత్య బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చూపుతుంది. అదే సమయంలో ప్రాంతీయ సహకారం, ఆర్థిక అనుసంధానం, భద్రతా సమస్యలపై చర్చలకు అవకాశం కల్పిస్తుంది. అయితే భారత్‌–పాక్‌ మధ్య ప్రధాన సమస్య సరిహద్దు ఉగ్రవాదం. ఇది ³రిష్కారం కాకుండా మోదీ పాకిస్తాన్‌ వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికే పహల్గాం దాడి తర్వాత 1960 నాటి సిందూ జలాల ఒప్పందాన్నే మోదీ హోల్డ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో ఎస్‌సీవో సమావేశానికి మోదీ వెళ్లడం కలే.

పాక్‌ ప్రకటన దౌత్యపరమైన నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఇది సంబంధాల్లో పెద్ద మలుపు కాకపోయినా, బహుపక్ష వేదికల్లో నిరంతర సంభాషణ కొనసాగుతుందని సూచిస్తోంది. భారత్‌ ఎలా స్పందిస్తుందో, మోదీ స్థాయిలో హాజరవుతారా అనేది విషయంపై రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper