Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi Vice Captain: వైభవ్ సూర్య వంశీకి వైస్ కెప్టెన్సీ.. వాళ్ళ కళ్ళు మండుతున్నాయి

Vaibhav Suryavanshi Vice Captain: వైభవ్ సూర్య వంశీకి వైస్ కెప్టెన్సీ.. వాళ్ళ కళ్ళు మండుతున్నాయి

Vaibhav Suryavanshi Vice Captain: జస్ట్ 15 సంవత్సరాలు.. అతడు కొడుతున్న కొట్టుడు ఆకాశమంత.. అతడు చూపిస్తున్న దూకుడు అంచనాలకు మించినంత.. అతడు వేగం కొలమానానికి సరిపోనంత.. ఇన్ని రకాలుగా ఉంది అతని ఆట.. దాని ఆట అనకూడదు వేట అనాలేమో.. టీమిండియాలో 15 సంవత్సరాల బాలుడు వైభవ్ సూర్య వంశీ సృష్టిస్తున్న సంచలనం గురించి ఎన్ని ఉపమానాలు రాసినా సరిపోదు. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా సాధ్యం చేసుకోలేని రికార్డులను అతడు సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్లో […]

Vaibhav Suryavanshi Vice Captain: జస్ట్ 15 సంవత్సరాలు.. అతడు కొడుతున్న కొట్టుడు ఆకాశమంత.. అతడు చూపిస్తున్న దూకుడు అంచనాలకు మించినంత.. అతడు వేగం కొలమానానికి సరిపోనంత.. ఇన్ని రకాలుగా ఉంది అతని ఆట.. దాని ఆట అనకూడదు వేట అనాలేమో..

టీమిండియాలో 15 సంవత్సరాల బాలుడు వైభవ్ సూర్య వంశీ సృష్టిస్తున్న సంచలనం గురించి ఎన్ని ఉపమానాలు రాసినా సరిపోదు. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా సాధ్యం చేసుకోలేని రికార్డులను అతడు సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్లో వీరవిహారం చేస్తున్నాడు. స్వదేశీ మైదానాలు మాత్రమే కాదు.. విదేశీ మైదానాల మీద విజృంభించి ఆడుతున్నాడు. ఇటీవల జింబాబ్వే సిరీస్లో అతడు ఉత్తమ ఆటకు సంబంధించి ఇచ్చే పురస్కారాలను సొంతం చేసుకోవడం అతడి ఆట తీరుకు ఒక నిదర్శనం.

సూర్య వంశీ ఆట తీరు మెచ్చిన మేనేజ్మెంట్ దులీప్ ట్రోఫీలో అతడికి ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా అవకాశం ఇచ్చింది. దీంతో అతడు తన ఆట తీరును మరింత మెరుగుపరచుకోవడానికి.. లోపాలను సవరించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇంతటి చిన్న వయసులోనే అతడు వైస్ కెప్టెన్ కావడం ఒకరకంగా అదృష్టం. ఇది అతడి ఆట తీరుకు దక్కిన గౌరవం. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ వ్యాఖ్యాత హర్షా బోగ్లే స్పందించారు.

బ్యాటింగ్లో బేబీ బాస్ ప్రతిభ అసాధారణంగా ఉందని హర్షా బోగ్లే పేర్కొన్నారు. ఇంకా అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు. ఎరుపు రంగు బంతి క్రికెట్లో అతడు కేవలం 12 ఇన్నింగ్స్లలో 207 పరుగులు మాత్రమే చేశాడని.. అటువంటి వ్యక్తికి వైస్ కెప్టెన్ పదవి ఎందుకిచ్చారని అతడు ప్రశ్నించాడు.

దీనిపై బేబీ బాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. క్రికెట్లో ఇప్పుడు అనుభవానికంటే గట్టిగా ఆడే ప్లేయర్లకు మాత్రమే వ్యాల్యూ ఉందని.. ఆ విషయాన్ని హర్షా బోగ్లే మర్చిపోయారని సూర్య వంశీ అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్లో అనుభవం ఉండాలని.. ఆ అనుభవం ఉంది కాబట్టి అతడికి మేనేజ్మెంట్ అవకాశాలు ఇస్తుందని.. మధ్యలో హర్షా బోగ్లే కు వచ్చిన నష్టం ఏంటని సూర్య వంశీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. సూర్య వంశీకి అవకాశాలు ఇవ్వడమే కాదు.. ఎలా ఇస్తే అతడు గొప్పగా ఆడతాడో మేనేజ్మెంట్ కు తెలుస్తని అతడి అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఎరుపు రంగు బంతి ఫార్మాట్లో సూర్య వంశీ నిలకడగా ఆడతాడని.. తద్వారా అతనిలో ఉన్న మరో కోణం కూడా తెలుస్తుందని అభిమానులు అంటున్నారు. ఈ వ్యవహారంలో హర్షా బోగ్లే ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper