spot_img
Homeఅంతర్జాతీయంLashkar E Taiba Saifullah Kasuri : చితక్కొటినా తోక జాడిస్తున్న లష్కరే తోయిబా.. తాజాగా...

Lashkar E Taiba Saifullah Kasuri : చితక్కొటినా తోక జాడిస్తున్న లష్కరే తోయిబా.. తాజాగా మోదీకి వార్నింగ్‌..!

Lashkar E Taiba Saifullah Kasuri : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం 26 మంది పర్యాటకులను పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కక ఎ తోయిబా అనుబంద రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేసట్టింది. ఇందులో తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత్‌ ధ్వసం చేసింది. లష్కర్‌ ఎ తోయిబాకు చెందిన వంద మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. భారత్‌ చితక్కొట్టినా ఆ సంస్థకు బుద్ధిరాలేదు. తాజాగా లష్కర్‌ ఎ తోయిబా ప్రధాన నాయకత్వంలో రెండో స్థానంలో ఉన్న సైఫుల్లా కసూరి ఇటీవల బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు, భారత్‌పై మళ్లీ ఉగ్రవాద ఒత్తిడి పెరిగే సూచనలుగా కనిపిస్తున్నాయి. ఆయన అభియోగాల ప్రకారం, భారత్‌ ఉద్దేశపూర్వకంగా నీటి ప్రవాహం పెంచి పాకిస్థాన్‌లో వరద నష్టాన్ని కలిగిస్తోందని ఆరోపించారు.

‘నీటి ఉగ్రవాదం‘ ఆరోపణ..
సింధూ జలాలు రెండు దేశాల మధ్య సున్నితమైన అంశం. దీన్ని ‘వాటర్‌ టెర్రరిజమ్‌‘గా వర్ణించడం పాకిస్థాన్‌లో ప్రజాభిప్రాయాన్ని భారత వ్యతిరేక దిశగా మలచే ప్రయత్నం చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సిందూ జలాల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్‌లో అయితే కరువు లేదంటే వరదలు ముంచెత్తుతున్నాయి.

పహల్గామ్‌ తరహా దాడులకు ప్లాన్‌..
ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్‌ దాడి విస్తృత భద్రతా చర్చలకు కారణమైంది. అదే తరహా దాడులు చేస్తామని సైఫుల్లా కసూచి ప్రకటించారు. ఈ సంఘటనను మళ్లీ ప్రస్తావించి, ‘మరొక పాఠం‘ అనే పదజాలం ఉపయోగించడం, ఉగ్రవాద శ్రేణుల మానసిక యుద్ధానికి భాగం. సైఫుల్లా తన ప్రసంగంలో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ను నేరుగా ఉద్దేశించడం, ఉగ్రవాద ముప్పు కేవలం నాన్‌–స్టేట్‌ యాక్టర్ల నుంచి కాకుండా, రాష్ట్రీయ మద్దతుతో నడుస్తుందనే అనుమానాలను బలపరుస్తోంది.

భారత్‌కు వ్యూహాత్మక పాఠాలు..
సైఫుల్లా హెచ్చరికల నేపథ్యంలో భారత్‌ అలర్ట్‌ అయింది. భూభాగం, జల వనరులు, సరిహద్దు రహదారులపై భద్రతా మానిటరింగ్‌ చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేలా వ్యూహాలు రచిస్తోంది. సిందూ జల ఒప్పందం రద్దును కొనసాగించడం వంటి అంశాలను పునరాలోచిస్తోంది.

సైఫులా వ్యాఖ్యలతో, భారత్‌లోని భద్రతా యంత్రాంగం సరిహద్దు రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అంతేకాక, పహల్గామ్‌ వంటి పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రణాళికలను పునర్వ్యవస్థీకరించే అవసరం ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper