Pawan Kalyan: స్టార్ హీరోల మీద అభిమానం తో ప్రేక్షకులు థియేటర్ కి వస్తుంటారు. స్క్రీన్ మీద తమ అభిమాన హీరోని చూసుకున్నప్పుడు వాళ్ళు చాలా గర్వంగా ఫీలవుతుంటారు. ఇక దానికి తగ్గట్టుగానే ఒక మంచి సినిమాతో హీరో వస్తే మాత్రం ఆ మూవీకి బ్రహ్మరథం పడుతుంటారు. ఎంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎన్ని విమర్శలు చేసినా కూడా ఒక్కసారి సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చిందంటే మాత్రం ఆ సినిమాని ఆపడం ఎవ్వరి తరం కాదు. మౌత్ టాక్ తోనే సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఓజీ’ సినిమా సైతం మొదటి షో తోనే సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంది. ఇక కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సినిమాలో పెద్దగా కంటెంట్ లేదని విమర్శలు చేసినప్పటికి సగటు ప్రేక్షకుడు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ అని చెబుతున్నారు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు ఆ రేంజ్ లో చూడలేదని, సుజీత్ ఈ మూవీలో చాలా బాగా చూపించాడు అంటూ ఈ సినిమా గురించి చాలా గొప్ప గా చెబుతున్నారు. ఇక ఈ సినిమా విషయంలో చాలా వరకు ప్రమోషన్స్ ను కూడా చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ సినిమా 400 కోట్ల మార్కును టచ్ చేయడానికి సిద్ధంగా ఉంది… ఇక రీసెంట్ గా రజినీకాంత్ ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో రజినీకాంత్ మేనియా చాలా వరకు డౌన్ అయింది.
ఈ సినిమా లాంగ్ రన్ లో 470 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది అనే వార్తలు వస్తున్నప్పటికి రజినీకాంత్ స్టామినాకి ఆ కలెక్షన్స్ రావడం అనేది చాలావరకు తక్కువే అని సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం రజనీకాంత్ రికార్డుని బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక దాంతో పాటుగా చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఒక సూపర్ హిట్ సినిమా రావడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే సినిమాకి రజనీకాంత్ నుంచి వస్తున్న సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే రజినీకాంత్ సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆయన సినిమా మీద భారీ అంచనాలు ఉంటాయి. సినిమా ఈజీగా వెయ్యి కోట్లు కలెక్షన్స్ రాబట్టగలిగే కెపాసిటీ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం తెలుగు మార్కెట్ ని ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ బరిలోకి దిగుతున్నాడు.
అతనికి ఇంతకు ముందు వరకు పాన్ ఇండియా మార్కెట్ లేదు…అయినప్పటికి ఓజీ సినిమాతో వందల కోట్లను కలెక్ట్ చేస్తున్నాడు అంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో విస్తరించిందో మనం అర్థం చేసుకోవచ్చు…ఒక రకంగా చెప్పాలంటే రజినీకాంత్ కంటే పవన్ కళ్యాణ్ కే ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా పెరిగిపోయింది. దానివల్లే రజనీకాంత్ రికార్డులను సైతం పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇక మరో 4 రోజుల్లో కూలీ సినిమా రికార్డును ఈజీగా బ్రేక్ చేస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు…