Homeఅంతర్జాతీయంLashkar-e-Taiba : వీడిన లష్కర్‌ ఉగ్రవాది డెత్‌ మిస్టరీ.. లేపేసింది మన దురంధరే!?

Lashkar-e-Taiba : వీడిన లష్కర్‌ ఉగ్రవాది డెత్‌ మిస్టరీ.. లేపేసింది మన దురంధరే!?

Lashkar-e-Taiba : పాకిస్తాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ. ప్రపంచం వ్యాప్తంగా నిషేధం అమలులో ఉన్న సంస్థ లష్కర్‌ ఎ తోయిబా. ఈ సంస్థలో ఆర్థిక నిర్వహణ అనేది కేవలం డబ్బు పంపిణీ కాదు. అది సంస్థ మనుగడకు, కార్యకలాపాల నిర్వహణకు, నియంత్రణకు మూలస్తంభం. ఇటీవల పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఒక మసీదులో ప్రార్థనలకు వెళ్లి ఆకస్మికంగా కూలిపోయి చనిపోయిన ఖారీ సయ్యద్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఈ నెట్‌వర్క్‌లోని అటువంటి కీలక వ్యక్తిగా వర్ణించబడుతున్నాడు. అతని మరణం మిస్టరీ […]

Lashkar-e-Taiba : పాకిస్తాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ. ప్రపంచం వ్యాప్తంగా నిషేధం అమలులో ఉన్న సంస్థ లష్కర్‌ ఎ తోయిబా. ఈ సంస్థలో ఆర్థిక నిర్వహణ అనేది కేవలం డబ్బు పంపిణీ కాదు. అది సంస్థ మనుగడకు, కార్యకలాపాల నిర్వహణకు, నియంత్రణకు మూలస్తంభం. ఇటీవల పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఒక మసీదులో ప్రార్థనలకు వెళ్లి ఆకస్మికంగా కూలిపోయి చనిపోయిన ఖారీ సయ్యద్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఈ నెట్‌వర్క్‌లోని అటువంటి కీలక వ్యక్తిగా వర్ణించబడుతున్నాడు. అతని మరణం మిస్టరీ ఎట్టకేలకు వీడుతోంది.

ఆర్థిక నిర్వహణలో కీలక పాత్ర
అబ్దుల్‌ అజీజ్‌ను లష్కర్‌ ఎ తోయిబా మొత్తం నెట్‌వర్క్‌కు ‘కింగ్‌పిన్‌’గా పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యులు, కార్యకర్తలకు నెలవారీ, వార్షిక ఆర్థిక సహాయం, అలాగే అవసరమైనప్పుడు ఆకస్మిక నిధులు అందించే బాధ్యత అతనిపై ఉండేదని సమాచారం. కశ్మీర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు లేదా సంబంధిత వ్యక్తులకు ఆర్థిక మద్దతు అందించడం, ఆ సమాచారాన్ని పర్యవేక్షించడం కూడా అతని పనిలో భాగం ముంబై దాడుల వ్యూహకర్తల్లో ఒకరు కూడా. ఇటువంటి వ్యక్తులు సాధారణంగా ముందుకు రాకుండా నేపథ్యంలో పనిచేస్తూ, నిధుల ప్రవాహాన్ని నియంత్రిస్తారు. అతని మరణం మిస్టరీగా మారిది.

మరణంపై అనుమానాలు
ఇస్లామాబాద్‌లోని మసీదులో ప్రార్థనలకు వెళ్లి ఆకస్మికంగా కూలిపోయి చనిపోయాడు. అజ్ఞాత వ్యక్తులు చంపి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మసీదుకు చేరుకోవడానికి ముందు ఒక హోటల్‌లో భోజనం చేశాడు. ఆ రెస్టారెంట్‌ నిర్వహణ పాకిస్తానీలే అయినప్పటికీ, అక్కడ పనిచేస్తున్న ఒక వెయిటర్‌ స్థానికేతరుడు. అతనే ఆహారం అందించాడు. ఆ వెయిటర్‌ ప్రస్తుతం కనిపించడం లేదు. అతని కుటుంబ సభ్యులు కూడా ఎవరూ అందుబాటులో లేరు. ఈ వివరాలు ఆకస్మిక మరణం కాకుండా, ముందస్తు ప్రణాళికతో జరిగిన చర్యగా కనిపిస్తున్నాయి. విచారణలో ఈ అంశాలు మరింత స్పష్టం కావాల్సి ఉంది.

నెట్‌వర్క్‌పై ప్రభావం
ఇటువంటి ఆర్థిక నిర్వాహకుల మరణం లేదా తొలగింపు సంస్థలో తాత్కాలిక అస్థిరతను కలిగించవచ్చు. నిధుల పంపిణీ, లెక్కలు, సంప్రదింపులు అంతరాయం కలగవచ్చు. ముంబై దాడులతో సంబంధం ఉన్న అజీజ్‌ మరణం అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది. మరణం సహజమైనదా, లేదా బాహ్య లేదా అంతర్గత కారణాల వల్ల జరిగిందా అనేది విచారణ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. రెస్టారెంట్‌లోని వెయిటర్‌ అదృశ్యం, కుటుంబ సభ్యులు లేకపోవడం వంటి అంశాలు ప్లాన్‌తో కూడిన చర్యగా సూచిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, ఈ సంఘటన ఉగ్రవాద నెట్‌వర్క్‌ల ఆర్థిక నిర్మాణం ఎంత కీలకమో, అలాగే అటువంటి వ్యక్తులు ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందో చూపిస్తుంది. అయితే మన దురంధర్‌లు ఇలాంటి వారిని కూడా గుర్తించి లేపేస్తున్నారు. ఇది పాకిస్తాన్‌ను కలవరపెడుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper