Homeఅంతర్జాతీయంBenjamin Netanyahu: నెతాన్యాహు కు షాక్.. ఇజ్రాయిల్ లో ప్రభుత్వం మారితే భారత్ కు కొత్త...

Benjamin Netanyahu: నెతాన్యాహు కు షాక్.. ఇజ్రాయిల్ లో ప్రభుత్వం మారితే భారత్ కు కొత్త చిక్కులేనా..

Benjamin Netanyahu:ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహు మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఆయన ఆధ్వర్యంలోని కూటమి లోని జుడాయిజం పార్టీ (7) తటస్థంగా ఉన్నట్టు ప్రకటించింది. దీంతో కూటమి బలం 53 నుంచి 46 స్థానాలకు తగ్గిపోయింది. అటు 19 సీట్లు గెలిచిన అరబ్ పార్టీలు ఐసెన్ కోట్ కు సపోర్ట్ చేశాయి. దీంతో ఐ సెన్ కోట్ బలం మ్యాజిక్ ఫిగర్ (61) ను దాటి 67 కు పెరిగిపోయింది. నవంబర్ 8న అధ్యక్షుడు […]

Benjamin Netanyahu:ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహు మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఆయన ఆధ్వర్యంలోని కూటమి లోని జుడాయిజం పార్టీ (7) తటస్థంగా ఉన్నట్టు ప్రకటించింది. దీంతో కూటమి బలం 53 నుంచి 46 స్థానాలకు తగ్గిపోయింది. అటు 19 సీట్లు గెలిచిన అరబ్ పార్టీలు ఐసెన్ కోట్ కు సపోర్ట్ చేశాయి. దీంతో ఐ సెన్ కోట్ బలం మ్యాజిక్ ఫిగర్ (61) ను దాటి 67 కు పెరిగిపోయింది. నవంబర్ 8న అధ్యక్షుడు ప్రధాని పేరును ప్రకటించబోతున్నారు.

ఇజ్రాయిల్ లో నెతాన్యాహు ప్రభుత్వం మారిపోతే భారత్ కు వెంటనే ఇబ్బంది వస్తుందని చెప్పడానికి లేదు. అయితే భారత్ – ఇజ్రాయిల్ వ్యూహాత్మక సంబంధాలపై కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశానికి ఇజ్రాయిల్ తో ఉన్న సంబంధాలు ఒక వ్యక్తి లేదా ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు. రక్షణ, ఆయుధాల కొనుగోలు, డ్రోన్లు,క్షిపణి వ్యవస్థలు, వ్యవసాయ సాంకేతికత, సైబర్ భద్రత వంటి అనేక రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం ఉంది.

రక్షణ రంగం..

భారతదేశానికి ఇజ్రాయిల్ అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామి. డ్రోన్లు, క్షిపణులు, రాడార్లు, నిఘా వ్యవస్థలో సహకారం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఈ సంబంధాలు కొనసాగడానికి అవకాశం ఉంది. అయితే కొత్త నాయకత్వం ప్రాధాన్యతల ఆధారంగా ఒప్పందాలు తీరు మారడానికి అవకాశం ఉంటుంది.

ఇరాన్ విషయంలో

ఇజ్రాయిల్ కొత్త ప్రభుత్వం ఇరాన్ దేశంతో వ్యవహరించే తీరులో మార్కులు తీసుకొస్తే భారత్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం.. చమురు ధరలు.. వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

అరబ్ దేశాలతో సంబంధాలు

కొత్త ప్రభుత్వం పాలస్తీనా అంశం మీద భిన్నమైన వైఖరి గనుక తీసుకుంటే ఇజ్రాయిల్, అరబ్ దేశాల సంబంధాలలో మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశానికి ఇజ్రాయిల్ తో పాటు గల్ఫ్ దేశాలతో బలమైన ఆర్థిక, ఇంధన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దౌత్యపరంగా సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉంటుంది.

వాణిజ్య ఒప్పందాలు

భారత్, ఇజ్రాయిల్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి పురోగతిని అంచనా వేయాల్సి ఉంటుంది.

ఐసెన్ కోట్ కు 67 మంది ఎంపీల సపోర్టు ఉందంటే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు కాదు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్డోగ్ ఎవరికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి అనే దానిమీద ఒక క్లారిటీ రావాలి. ఆ తర్వాత మెజారిటీని కచ్చితంగా నిరూపించుకోవాలి. కొత్త కూటమిలో పార్టీల మధ్య కూడా విధానపరమైన విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.

మన దేశానికి ముఖ్యమైనది నెతాన్యాహు అధికారంలో ఉండటమా.. ఐసెన్ కోట్ అధికారంలోకి రావడం అనేది ఇక్కడ ముఖ్యం కాదు. కొత్త ప్రభుత్వం రక్షణ.. ఇంధనం.. వాణిజ్యం.. ఇరాన్, అరబ్ దేశాల విషయంలో ఎలాంటి విధానాలు అనుసరిస్తుందనేది ఇక్కడ అత్యంత కీలకం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper