Homeఅత్యంత ప్రజాదరణISRO Chairman Salary: ఇస్రో చైర్మన్ కు 27 లక్షలు.. టీవీ ప్రోగ్రామ్ కు 15...

ISRO Chairman Salary: ఇస్రో చైర్మన్ కు 27 లక్షలు.. టీవీ ప్రోగ్రామ్ కు 15 కోట్లు.. హర్ష్ గోయంకా పోస్ట్ వైరల్

ISRO Chairman Salary: శాస్త్రవేత్తల విలువ ఇంతేనా.. మీడియా షోలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు.. దేశాన్ని అంతరిక్షంలో ముందుకు నడిపించే శాస్త్రవేత్తలకు మాత్రం పరిమితంగా వేతనాలు ఇస్తున్నారు.. భారత్ ప్రాధాన్యతలు మారాల్సిందేనా.. సరిగా ఇవే ప్రశ్నలను వ్యక్తం చేశారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయంక. ఏవియేషన్ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలకు గట్టి పోటీస్తోంది.. జాబిల్లి, సూర్యుడి మీద భారత ఏవియేషన్ సంస్థ (ISRO) భారతదేశ ప్రతిభను.. యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చూసే స్థాయికి తీసుకెళ్లింది.. లిమిటెడ్ […]

ISRO Chairman Salary: శాస్త్రవేత్తల విలువ ఇంతేనా.. మీడియా షోలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు.. దేశాన్ని అంతరిక్షంలో ముందుకు నడిపించే శాస్త్రవేత్తలకు మాత్రం పరిమితంగా వేతనాలు ఇస్తున్నారు.. భారత్ ప్రాధాన్యతలు మారాల్సిందేనా.. సరిగా ఇవే ప్రశ్నలను వ్యక్తం చేశారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయంక.

ఏవియేషన్ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలకు గట్టి పోటీస్తోంది.. జాబిల్లి, సూర్యుడి మీద భారత ఏవియేషన్ సంస్థ (ISRO) భారతదేశ ప్రతిభను.. యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చూసే స్థాయికి తీసుకెళ్లింది.. లిమిటెడ్ బడ్జెట్ తో ప్రయోగాలు చేస్తోంది మనదేశం. ఈనేపథ్యంలో మన సైంటిస్టులకు ఇస్తున్న వేతనాల గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా చేసిన సోషల్ మీడియా పోస్టు టీచర్లకు కేంద్రంగా మారింది. దేశంలో మనం దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామనే ప్రశ్న ఆయన లేవనెత్తారు.

15 కోట్లు ఇస్తున్నారు

దూరదర్శన్ లో ఒక ప్రోగ్రామ్ కోసం 15 కోట్లు కేటాయిస్తున్నారు. కాగా, భారత అంతరిక్ష సంస్థను నడిపిస్తున్న వ్యక్తికి కేవలం అంతేనా ఇచ్చేది. ఇది సరైన విధానం కాదని, ఇండియా సివిల్ ఏవియేషన్ విభాగంలో సత్తా చూపించాలంటే..సైంటిస్టులను ఆకర్షించడంతోపాటు, వారిని ప్రోత్సహించే విధంగా సాలరీలు ఉండాలని హర్ష్ అభిప్రాయపడ్డారు.

ఒక సివిల్ ఏవియేషన్ ఎక్సర్ మెంట్ సక్సెస్ కావాలంటే చాలా వ్యవహారం ఉంటుంది. వందల మంది హార్డ్ వర్క్ చేస్తారు. ఒకవేళ ఎక్సర్ పెంట్ ఫెయిల్యూర్ అయితే విపరీతంగా నష్టం ఉంటుంది. దాని ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. ఈనేపథ్యంలో గతంలో మనదేశ అంతరిక్ష రంగానికి నాయకత్వం వహించిన ఎస్ సోమనాథ్ కూడా గతంలో వేతనాల గురించి కామెంట్లు చేశారు.

ఇక ఇందులో మరో కోణాన్ని కూడా పరిశీలించాలి. ప్రభుత్వ ప్రసార సంస్థలు ప్రజలకు వార్తలు, సమాచారాన్ని అందించడంతోపాటు, సమకాలీన అంశాలపై కార్యక్రమాలను రూపొందిస్తాయి. ఆ ఖర్చుతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోంది.. కార్యక్రమం నాణ్యత ఏమిటి.. ఒప్పందం పారదర్శకంగా జరిగిందా.. ఖర్చుకు తగిన ఫలితం వస్తోందా.. అనే అంశాలు కూడా పరిశీలించాలి. ఇక ఇదే సమయంలో ప్రజాదానంతో పని చేసే సంస్థలు తమ ఖర్చులకు సంబంధించి పారదర్శకతను పాటించాలి. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాకపోతే హర్ష్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి.. రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. కేటాయింపులు, ఇతర అంశాలు ప్రభుత్వ ప్రాధన్యతల మీద అధారపడి ఉంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper