ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో క్వాడ్ (QUAD) దేశాల నేతల సమావేశానికి ముందు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన దేశ జెండాపై చూపిన గౌరవం అందరి దృష్టిని ఆకర్షించింది. సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్న లాజిస్టిక్స్ బృందం భారత జాతీయ జెండాను కాళ్ల కింద మోడీ నిలబడే చోట ఉంచగా ఈ విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ స్వయంగా ముందుకు వచ్చి జెండాను చేతిలోకి తీసుకున్నారు.
సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ సమావేశాల్లో జెండాల ఏర్పాటు ఇతర ఏర్పాట్లను సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. అయితే ఇక్కడ నిలబడాలని కాళ్ల కిందవేసిన భారత జాతీయ జెండాను చూసిన మోదీ.. సిబ్బంది కోసం ఎదురుచూడకుండా స్వయంగా దానిని తీసుకున్నారు. అనంతరం జెండాను జాగ్రత్తగా తీసుకొని తన జేబులో పెట్టుకున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ జెండా పట్ల ప్రధాని మోదీ చూపిన గౌరవాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. దేశ ప్రతిష్ఠ, జాతీయ చిహ్నాల గౌరవం విషయంలో ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఫిదా చేసింది. చిన్న సంఘటన అయినప్పటికీ.. జాతీయ జెండాపై గౌరవాన్ని చాటిచెప్పేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
క్వాడ్ కూటమిలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ఆర్థిక సహకారం, సముద్ర మార్గాల రక్షణ వంటి కీలక అంశాలపై ఈ దేశాలు పరస్పరం చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మనీలాలో జరిగిన ఈ ఘటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
PM Modi picks up the Indian Flag, put as position holder by logistics team ahead of the gathering of Quad leaders in Manila https://t.co/n5foD2q41g
— Sidhant Sibal (@sidhant) November 17, 2026