Ramayana Movie: నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై , పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తోంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 160 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. బాలీవుడ్ సినిమాల్లో ఇది ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదని అంటున్నారు. సరైన హైప్ లేకపోవడం వల్లే , ఇక్కడ ఓపెనింగ్స్ మిస్ అయ్యాయి అని అంచనా వేస్తున్నారు. కానీ టాక్ బాగా ఉండడం తో రెండవ రోజు వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో బాగా పుంజుకున్నాయి. ముఖ్యంగా సిటీస్ లో ఈ చిత్రం హౌస్ ఫుల్స్ ని నూన్ షోస్ నుండే నమోదు చేసుకుంటున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం లో రాముడిగా నటించిన రణబీర్ కపూర్ కంటే , రావణుడిగా నటించిన యాష్ కి మంచి పేరొచ్చింది. కొన్ని నెలల క్రితమే టాక్సిక్ చిత్రం తో యాష్ సంపాదించుకున్న నెగెటివిటీ మొత్తం ఈ సినిమాతో పోయిందని చూసినా ప్రతీ ఒక్కరు అంటున్నారు. ఇక రెమ్యూనరేషన్స్ విషయం లో యాష్ డామినేషన్ కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆయన నటించడం మాత్రమే కాదు , సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అంటే రెమ్యూనరేషన్ కి బదులుగా 30 శాతం లాభాల్లో వాటాలు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ చిత్రం వెయ్యి కోట్లు రాబడితే , యాష్ వాటా 300 కోట్ల రూపాయిలు. ఇక రణబీర్ కపూర్ రెమ్యూనరేషన్ దాదాపుగా 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక సాయి పల్లవి కి 8 కోట్లు, హనుమాన్ పాత్రలో నటించిన సన్నీ డియోల్ కి 25 కోట్లు, రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ వంటి వాళ్లకు చెరో మూడు కోట్ల రూపాయిల రెమ్యూనిటిన్ ఇచ్చినట్టు సమాచారం.