Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej: గ్రాండ్ గా జరిగిన సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్ధ వేడుక..వైరల్ అవుతున్న...

Sai Dharam Tej: గ్రాండ్ గా జరిగిన సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్ధ వేడుక..వైరల్ అవుతున్న ఫోటోలు!

Sai Dharam Tej:  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న హైదరాబాద్ లోని తన నివాసం లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతూ వచ్చిన సాయి ధరమ్ తేజ్ కి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అనే సందేహం మెగా అభిమానుల్లో కూడా ఉండేది. రెండు మూడు సార్లు లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని , పెళ్లి పై ఆసక్తి […]

Sai Dharam Tej:  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న హైదరాబాద్ లోని తన నివాసం లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతూ వచ్చిన సాయి ధరమ్ తేజ్ కి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అనే సందేహం మెగా అభిమానుల్లో కూడా ఉండేది. రెండు మూడు సార్లు లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని , పెళ్లి పై ఆసక్తి పోయింది అంటూ పలు ఇంటర్వూస్ లో సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాదు రెజీనా , రాశీ ఖన్నా వంటి హీరోయిన్స్ తో ఈయన డేటింగ్ చేసాడనే రూమర్స్ కూడా గట్టిగా వినిపించాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని నిన్నటితో క్లారిటీ వచ్చేసింది.

తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్ తో గత కొంత కాలం నుండి డేటింగ్ చేస్తూ వచ్చిన సాయి ధరమ్ తేజ్ , ఎట్టకేలకు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. వచ్చే నెలలో వీళ్లిద్దరి పెళ్లి జరుగనుంది. ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ , అల్లు ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ రాలేకపోయాడు కానీ , ఆయన తనయుడు అకిరా నందన్, కూతురు ఆద్య ఈ నిశ్చితార్ధ వేడుక లో సందడి చేశారు. కానీ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఈ నిశ్చితార్ధ వేడుకలో కనిపించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇక చాలా కాలం తర్వాత రామ్ చరణ్ , అల్లు అర్జున్ లను ఒకే వేదికపై చూడడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper