Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో, అందరికీ నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రోహిత్ మాత్రమే. ఆట పరంగా , మాట పరంగా, తెలివి పరంగా , రిలేషన్స్ పరంగా , ఇలా అన్ని విషయాల్లోనూ రోజురోజుకి రోహిత్ జనాలకు తెగ నచ్చేస్తున్నాడు. కేవలం రోహిత్ మాత్రమే కాదు , మిగిలిన కామనర్స్ కూడా మంచి పేరు ని సంపాదించుకుంటున్నారు. సెలబ్రిటీలు వాళ్ళని టార్గెట్ చేసి విపరీతమైన నెగిటివిటీ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. రోహిత్ లో తప్పులు వెతికేంత ఛాన్స్ కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. కానీ అలాంటి రోహిత్ కి నేటి ఎపిసోడ్ లో నాగార్జున అతనికి ఫుల్ కోటింగ్ ఇచ్చాడట.
అసలు అంతలా కోటింగ్ ఇచ్చేంత తప్పు రోహిత్ ఏమి చేశాడు ?, తనపై నోరు పారేసుకున్న త్రిగున్ ని కూడా చాలా కూల్ గా హ్యాండిల్ చేశాడే ?, పైగా మొదటి హౌస్ మేట్ కూడా అయ్యాడు. ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ కూడా రోహిత్ ని టార్గెట్ చేయడం అన్యాయం అంటూ ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ , విశ్లేషకులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , త్రిగున్ ని పెద్దగా తిట్టలేదట, కేవలం అతను మాట్లాడిన భాషకు సింపుల్ గా మందలించి ఒదిలేశాడట. అంతే కాదు శనివారం ఎపిసోడ్ లో మొట్టమొదటగా నామినేషన్స్ ని సేవ్ అయ్యేది మరెవరో కాదు , త్రిగునే అట. ఆ తర్వాత షాలిని నామినేషన్స్ నుండి సేవ్ అవుతుందని సమాచారం. త్రిగున్ కి కోటింగ్ లైట్ గా ఇవ్వడం వెనుక పెద్ద స్ట్రాటజీ కూడా దాగుంది. అతనికి నాగార్జున తప్పు చేస్తున్నావు , రోహిత్ ని టార్గెట్ చేసి అనే హింట్ ఇచ్చాడంటే, రోహిత్ అతన్ని టార్గెట్ చేయడం మానేస్తాడు , బోలెడంత కంటెంట్ మిస్ అవుతుంది.
ఇది బిగ్ బాస్ టీం కి ఇష్టం లేదు. అందుకే నాగార్జున చేత ఇలా ప్లాన్ చేయించారు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయం లో రోహిత్ కి కోటింగ్ ఇస్తే , జనాల్లో అతనికి సానుభూతి బాగా పెరుగుతుంది , ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్తాడు. ఈ స్ట్రాటజీ ని పర్ఫెక్ట్ గా నాలుగైదు వారాల వరకు కొనసాగిస్తారు అన్నమాట. చూస్తుంటే ఈ సీజన్ ని అభిజిత్ , అఖిల్ సీజన్ లాగా మార్చేలా ఉన్నారని అనిపిస్తోంది. వచ్చే వారం కూడా ఊహించని ట్విస్టులు , ఎలిమినేషన్స్ చాలానే ఉండబోతున్నాయి అట. మరి వాటిని తట్టుకొని ఎంత మంది సభ్యులు హౌస్ లో మిగులుతారో చూడాలి.