Bollaram Army camp: ఆర్మీ క్యాంపుల వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అందులోకి సామాన్య ప్రజలు కాదు కదా.. హోదా ఉన్నవాళ్లు కూడా అడుగుపెట్టలేరు. అటువంటి ప్రదేశంలో దొంగతనం జరిగిందంటే మామూలు విషయం కాదు. పైగా అత్యంత ఆధునికమైన ఆయుధాలు చోరీకి గురయ్యాయి.
ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తినే పద్యంలో మిలిటరీ ఇంటెలిజెన్స్.. పోలీసులు దర్యాప్తు చేశారు. ఒక విశ్రాంత హవల్దార్ ను అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతడే ఇదంతా చేశాడని వివరించారు. వాస్తవానికి ఆ స్థాయిలో ఒక వ్యక్తి అన్ని ఆయుధాలను తీసుకెళ్లగలడా.. అనే సందేహం వ్యక్తం అవుతుంది. ఈ చివరికి పాల్పడిన వ్యక్తి పేరు మల్లేష్ అలియాస్ రాజు. అతని అరెస్ట్ చేసి.. దొంగిలించిన ఆయుధాలను మొత్తం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ డిజిపి ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం మల్లేష్ మూడు రోజులపాటు నిర్వహించాడు. ఆ తర్వాత ఆర్మీ క్యాంపులో ఉన్న లోపాలను గుర్తించాడు. ఆ తర్వాత ఆగస్టు 30 రాత్రి 11 గంటల సమయంలో ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించాడు. ప్రధాన సముదాయంలో ఉండే ఆయుధాల స్టోరేజీ తాళాలు పగలగొట్టాడు. నాలుగు ఏకే 203 అసాల్ట్ రైఫిల్స్..ఒక ఇన్సాస్ రైఫిల్.. 6 9 ఎం ఎం తుపాకులు.. మరో సివిలియన్ తుపాకీ.. నైట్ విజన్ బైనాక్యులర్.. సుమారు 7 50 కి పైగా లైవ్ బుల్లెట్లు దొంగతనం చేశాడు. ఈ ఆయుధాలను ఒక మోటార్ వెహికల్ మీద రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒక ఆలయం దగ్గర వాటిని దాచిపెట్టి.. మరుసటి రోజు బాలాజీ నగర్ ప్రాంతంలోని తన ఇంట్లో ఉన్న కారును తెచ్చి.. అందులో ఆయుధాలను భద్రపరచాడు.
పోలీసులు తీవ్రంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అనేక ప్రాంతాలలో ఆయుధాలను మార్చాడు. ఈ ఘటన జరిగిన తర్వాత ముందుగా ఇది అంతర్గత వ్యవహారం అని పోలీసులు. దేశానికి సంబంధించిన భద్రత.. ఇంటలిజెన్స్.. మాదకద్రవ్యాల మాఫియా ఇంకా అనేక కోణాలలో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఇటీవల విశ్రాంత ఉద్యోగులుగా మారిన ఇద్దరి మీద పోలీసులు దృష్టి సారించారు. మల్లేష్ కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయి. అతని ఫోన్లో చాట్స్ డిలీట్ అయ్యాయి. కాల్ రికార్డులు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోలీసులు అతడిని విచారించారు. ఇదితో అతడు నేరం ఒప్పుకున్నాడు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిసిపి ఆధ్వర్యంలో బృందాలు అతడు దాచిన ఆయుధాలను రికవరీ చేశాయి. అయితే కేవలం మల్లేష్ మాత్రమే కాకుండా.. ఇంకా చాలామంది ఆర్మీ అధికారుల ప్రమేయం ఇందులో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి చాలా విషయాలు పోలీసులు బయటపెట్టలేదని సమాచారం. విశ్రాంత అధికారిని మాత్రం ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిగా పోలీసులు చూపించారు.
@TelanganaDGP @CVAnandIPS along with senior police officers, addresses a media conference on the Madras Regiment arms theft case at the DGP Office on Friday. The recovered arms were also displayed during the briefing.
Video: Rama Moorthy P https://t.co/c3kCU65SRg pic.twitter.com/zHZ3CVVB3U— TOI Hyderabad (@TOIHyderabad) September 11, 2026