Homeఅంతర్జాతీయంLife Imprisonment: నాలుగేళ్ల చిన్నారికి జీవిత ఖైదు.. అభియోగాలు తెలిస్తే షాక్ అవుతారు..

Life Imprisonment: నాలుగేళ్ల చిన్నారికి జీవిత ఖైదు.. అభియోగాలు తెలిస్తే షాక్ అవుతారు..

Life Imprisonment: అండర్ ట్రయల్ ఈ పదం ఎప్పుడైనా విన్నారా.. వినే ఉంటారు. అదేనండీ.. నేరం నిరూపన కాకుండా జైలులో ఉండడం. ఇలా చాలా దేశాల్లో చాలా మంది వారిపై మోపిన అభియోగానికి వేసే శిక్షకంటే ఎక్కువ కాలం జైల్లోనే గడుపుతారు. ఒక వేళ వారిపై మోపిక అభియోగం తప్పని తేలితే న్యాయ స్థానం తలదించుకోవాలి. జపాన్ కు చెందిన ఇవావో హకమడ తన యజమాని కుటుంబాన్ని హత్య చేశాడన్న ఆరోపణలపై అతనికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ఆయన సోదరి హై కోర్టులో కేసు వేయడంతో అక్కడ న్యాయమూర్తులు కేసును కొట్టేశారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో కొట్లాడగా.. అతను నిర్ధోషి అని తెలిసింది. అతను చేయని తప్పునకు దాదాపు 45 సంవత్సరాలు జైల్లోనే గడిపాడు. ఇలాంటి తప్పులు చాలా న్యాయవ్యవస్థకు తలవంపులుగా మారుతాయి. ఇలాంటిదే ఈ ఘటన కూడా.. ఎవరైనా తప్పు చేయవచ్చు. పిల్లలు లేదా యువకులు లేదా బాలికలు తప్పు చేస్తే వారిని శిక్షించే బదులు, జువైనల్ హోమ్‌కు పంపుతారు. అక్కడ వారిని చదువు చెప్తూనే, మంచిగా చూసుకుంటారు. శిక్షా కాలం పూర్తయిన తర్వాత బయటకు పంపుతారు.

అయితే ఇక్కడ నాలుగేళ్ల చిన్నారికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇది ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాలుగేళ్లంటే ఒకరు చూస్తే భయపడే వయస్సు. అలాంటి బాలుడికి కోర్టు ఇంత పెద్ద శిక్ష ఎలా విధించింది తెలుసుకుందాం. ఈజిప్టుకు చెందిన 4 ఏళ్ల మన్సూర్ కురాని అలీపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల కారణంగా అక్కడి కోర్టు మన్సూర్‌కు జీవిత ఖైదు విధించింది. నలుగురిని హత్య చేసి 8 మందిపై హత్యాయత్నం చేయడంతో పాటు పోలీసులను బెదిరించినందుకు ఈ చిన్న పిల్లవాడికి శిక్ష పడింది. ఈ వార్తతో ఈజిప్టు వాసులు ఆగ్రహానికి గురయ్యారు. దేశం మొత్తం కలిసి నిరసన వ్యక్తం చేసింది.

కోర్టు తీర్పుపై అక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో ఖండించింది. పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ కేసును తీవ్రంగా విమర్శించారు, కానీ కోర్టు నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఒక సంవత్సరం తర్వత, ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినప్పుడు, ప్రపంచం మొత్తం కలిసి ఈజిప్ట్ చట్టాన్ని ఖండించింది. ఒత్తిడితో కోర్టు ఘటనపై మళ్లీ విచారణకు ఆదేశించింది.

మన్సూర్ దోషిగా నిర్ధారించబడిన నేరాలు, అతను కటకటాల వెనుక శిక్ష అనుభవిస్తున్న నేరాలు అన్నీ అవాస్తవమని విచారణ ఫలితాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మన్సూర్ అలాంటిదేమీ చేయలేదు. ఏం జరిగిందంటే.. మన్సూర్ పై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ జరపకుండా శిక్ష విధించారు.

2014లో ఈజిప్టులో జరిగిన అల్లర్లలో పాల్గొన్నందుకు 115 మందితో పాటు మన్సూర్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. తర్వాత, ఈ ఘటనపై విచారణ జరిపి, వారు నిర్ధోషులుగా తేలినప్పుడు, కోర్టు మన్సూర్ తండ్రిని క్షమించమని కోరింది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular