Hindu woman assaulted Bangladesh: బంగ్లాదేశ్లో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ శాంతిభద్రతలు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు హిందువులను అక్కడి చాందసవాదులు చంపేశారు. వరుసగా జరిగిన ఈ ఘటనలు బంగ్లాదేశ్లో హిందువుల భద్రత ఎలా ఉందో రుజువు చేశాయి.
Also Read: అందుకే ఆమెకు వెనిజులా అధ్యక్ష పదవి రాకుండా ట్రంప్ అడ్డు పుల్ల
బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. హిందువుల భద్రత మరింత ప్రమాదంలో పడింది. లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడుల వల్ల.. రోజుకొక దారుణం వెలుగు చూస్తోంది. తాజాగా హిందూ వితంతు పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె దగ్గర నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశారు. అత్యాచారం చేసిన తర్వాత ఆమె చెట్టుకు కట్టేశారు. జుట్టును కత్తిరించారు. అత్యంత అవమానకరంగా వ్యవహరించారు. ఈ దారుణం కలిగంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
కలిగంజ్ ప్రాంతంలో షహీన్, అతడి సోదరుడు వద్ద హిందూ వితంతువు కొంత భూమిని కొనుగోలు చేసింది. దాంతోపాటు వారికి సంబంధించిన ఒక ఇంటిని కొనుగోలు చేసింది. అయితే అప్పటినుంచి షహీన్ ఆ హిందూ వితంతు మీద అత్యంత అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల ఆ మహిళ ఇంటికి బంధువులు వచ్చారు. ఆ సమయంలో షహిన్, అతడి సోదరుడు హసన్ ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె బంధువులను తరిమికొట్టారు. ఆ తర్వాత ఆ వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డారు. డబ్బులు కూడా డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి ఆమె ఒప్పుకోకపోవడంతో.. చెట్టుకు కట్టివేశారు. ఆమె జుట్టును కత్తిరించారు. ఈ దారుణాన్ని వారు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: వెనిజులా పతనం.. భారతదేశానికి గుణపాఠం.. ఎలాగంటే..
బాధిత మహిళ తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కలిగంజ్ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఆ ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆ దేశంలో మరోసారి హిందువుల భద్రత ఎలా ఉందో నిరూపించింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో ఈ తరహా దారుణాలు విపరీతంగా చోటు చేసుకుంటున్సాయి. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడుల వల్ల బంగ్లాదేశ్లో హిందువుల భద్రత ప్రమాదంలో పడింది. ఈ స్థాయిలో దాడులు కొనసాగుతున్నప్పటికీ తాత్కాలిక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.