Homeక్రైమ్‌Bihar Police: కర్రలు, రాడ్లతో పోలీసులపై దాడి.. గన్ చూపించినా భయపడని గుండాలు.. వైరల్ వీడియో

Bihar Police: కర్రలు, రాడ్లతో పోలీసులపై దాడి.. గన్ చూపించినా భయపడని గుండాలు.. వైరల్ వీడియో

Bihar Police: పౌరుల రక్షణ, తప్పు చేసిన వారిని శిక్షించేందుకు పోలీసులు ఉన్నారు. మరి వారికే భద్రత లేకపోతే. అందుకే చట్టం వారికి కొన్ని ఆయుధాలు, ప్రత్యేక అధికారులను ఇచ్చింది. అవి కూడా వారిని కాపాడకుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. వారిని వారే కాపాడుకోలేని పరిస్థితి ఎదురైతే ఎలా అంటూ అనుమానాలు కలుగుతున్నాయి. బిహార్ లో జరిగిన ఒక ఘటనే దీనికి ఉదాహరణ. గూండాల గుంపు పోలీస్ సిబ్బందిపై దాడి చేయడం, ఒక ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా గాయపడడం కనిపిస్తుంది. మోతిహారిలో కిడ్నాప్‌కు గురైన ఇద్దరు బాలికలను రక్షించేందుకు వచ్చిన పోలీసులపై గుండాలు దాడికి దిగారు. ప్రేమ వివాదంలో ముడిపడి ఉన్న కేసులో అపహరణకు గురైన ఇద్దరు బాలికల ఆచూకీని కనిపెట్టిన పోలీసుల బృందం మోతిహారికి చేరుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులపై కర్రలు, రాడ్ లతో ఒక గుంపు వారిపై దాడికి దిగింది. ఇన్‌ స్పెక్టర్ పిస్టల్‌ చూపించి భయపెట్టినా కూడా భయపడలేదు. ఈ క్రమంలో జరిగిన గందరగోళంలో ఇన్‌స్పెక్టర్‌ తలకు బలమైన గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. హింసాత్మకమైన గుంపును అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు నిస్సహాయంగా కనిపించినట్లు వీడియో క్లిప్ చూపిస్తుంది. దుండగుల గుంపు అదుపు లేకుండా దాడిని కొనసాగించారు.

వైరల్ వీడియో.. సోషల్ మీడియాలో దుమారం
‘ఘర్ కే కలేష్’ అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో అప్‌లోడ్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. బిహార్‌లో చట్టాన్ని అమలు చేసే వారి భద్రతపై చాలా మంది తమ నిరాశ వ్యక్తం చేశారు. వీడియో క్యాప్షన్ ఇలా ఉంది, ‘మోతిహారిలో కిడ్నాప్‌కు గురైన బాలికను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై జనసైనికులు దాడి చేశారు. ఈ దాడిలో ఇన్‌ స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. బిహార్‌లోని హాస్పిటల్ లో చేరారు.’ హింసతో దిగ్భ్రాంతికి గురైన వినియోగదారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘బిహార్‌లో పోలీసులు కూడా సురక్షితంగా లేరు’ అని మరొకరు కామెంట్ చేశాడు.

మెరుగైన లా అండ్ ఆర్డర్ కోసం పిలుపు
ఈ ఆందోళనకరమైన ఘటన విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారుల భద్రత, శాంతి భద్రతల గురించి ప్రశ్నలను లేవనెత్తింది. చట్టాన్ని రక్షించే పోలీసులకే భద్రత లేకుంటే సాధారణ పౌరులకు వారు ఏం మద్దతిస్తారని ప్రజా ప్రతినిధులే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కిడ్నాప్ కు గురైన యువతిని రక్షించేందుకు వెళ్లిన పోలీసులకు ఇలాంటి ఘటన ఎదురైతే ఇక ఆడ వారి మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని కొందరు అంటున్నారు. ఆ గుంపుపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular