
Rashmika Mandanna: ఐదడుగుల రష్మిక మందానకు కూడా సరిపడా బట్టలు దొరకడం లేదు. పాపం అరాకొరా బట్టల్లో అవస్థలు పడుతుంది. బెడ్ రూంలో బాత్ రూంలో వేసుకోవాల్సిన సైజు పబ్లిక్ లో ట్రై చేస్తుంది. రష్మిక తీరు చూసి బాలీవుడ్ జనాలు కూడా… మరీ అతి చేస్తుంది అంటున్నారు. రష్మిక హిందీ హీరోయిన్స్ ని మించిపోయేలా స్కిన్ షో చేస్తానంటుంది. ఆన్ స్క్రీన్లో ఎంత కురచైన బట్టలు వేసుకున్నా… పాత్ర కోసమో పరమార్ధం కోసమో అనుకుంటారు. జనాల్లోకి ఇలా వచ్చేస్తేనే అసలు సమస్య.
రష్మిక స్టార్ హీరోయిన్. ఆమెకంటూ మార్కెట్, ఓ రేంజ్ ఉంది. కాబట్టి అర్థనగ్న సౌందర్యంతో కొత్తగా పొందే గుర్తింపు ఏం లేదు. ఆఫర్స్ వచ్చి పడే మార్గం లేదు. జీ సినిమా అవార్డ్స్ వేడుకలో అందరినీ ఆకర్షించాలని పరువు పోగొట్టుకుంది. మరీ పొట్టి డ్రెస్ లో శరీరం దాచుకోలేక ఇబ్బంది పడింది. ఫోటోగ్రాఫర్స్ కామెంట్స్ కి ఏడవలేక నవ్వినట్లు ఫేస్ పెట్టింది. పైపైకి పోతున్న ఆమె డ్రెస్ ను అసిస్టెంట్స్ కి సర్దడమే సరిపోయింది.

రష్మీక హాట్ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ డ్రెస్ లో ఆమె మెరిసిపోయింది కాదు… పరువు పోగొట్టుకుందని. నార్త్ బ్యూటీలే పద్దతైన బట్టలు ఎంచుకుంటుంటే సౌత్ బ్యూటీ మాత్రం… వాళ్లకు తెలియని తెగింపు పరిచయం చేయాలని చూస్తుంది. గతంలో కూడా ఇదే తరహాలో రెడ్ బాడీ కాన్ డ్రెస్ ధరించి ఫోటోగ్రాఫర్స్ తన చుట్టూ చేరేలా చేసుకుంది. ఆ కురచబట్టల్లో కూర్చోలేక తెగ ఇబ్బంది పడింది.
రష్మిక తీరు చూసిన సౌత్ ఆడియన్స్ చూపించు కానీ మరీ తెగించకని సలహా ఇస్తున్నారు. బాలీవుడ్ లో ఎదగాలనే తపనతో రష్మిక ఇలా చేస్తున్నారనిపిస్తుంది. అయితే ఆమె అసలు తీరే సూచనలు కనిపించడం లేదు. ఆమె నటించిన హిందీ చిత్రాలు రెండూ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. గుడ్ బై, మిషన్ మజ్ను ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే ఆమె చేతిలో యానిమల్ వంటి క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో ఆ మూవీపై అంచనాలు ఉన్నాయి.
యానిమల్ విజయం సాధిస్తే రష్మిక కెరీర్ కి ప్లస్ అవుతుంది. అలాగే అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 మూవీ చేస్తున్నారు. ఇటీవల సెట్స్ పైకి వెళ్లిన పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుంది. సుకుమార్ ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీవల్లిగా రష్మిక మరోసారి అలరించనుంది. ఈ మధ్య రష్మిక నటించిన చిత్రాల్లేవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. పుష్ప 2, యానిమల్ చిత్ర ఫలితాలు ఆమె కెరీర్ డిసైడ్ చేయనున్నాయి.