Allari Naresh: టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోల లిస్ట్ తీస్తే అందులో అల్లరి నరేష్ పేరు కచ్చితంగా ఉంటుంది. లెజండరీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నరేష్ అతి తక్కువ సమయం లోనే కామెడీ హీరో గా స్టార్ రేంజ్ కి ఎదిగాడు. కేవలం కామెడీ హీరో గా మాత్రమే స్థిరపడకుండా , అప్పుడప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తూ నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగాడు అల్లరి నరేష్. ఆయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాలి అనే ఆడియన్స్ లక్షల్లోనే ఉన్నారు. అయితే ఈమధ్య కాలం లో నరేష్ సినిమాలు పెద్దగా ఆడడం లేదు. సీరియస్ సినిమాలు తీస్తుంటే వర్కౌట్ అవ్వడం లేదని , తనకి కలిసొచ్చిన కామెడీ జానర్ లో సినిమాలు తీసినప్పటికీ కూడా వర్కౌట్ అవ్వడం లేదు.
ఇదంతా పక్కన పెడితే అల్లరి నరేష్ కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు అనే విషయం మీకు తెలుసా. ఆయన కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘బెండు అప్పారావు’. ఈ చిత్రానికి తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. అయితే మరో నాలుగు రోజుల్లో షూటింగ్ ముగిస్తుంది అనగా , ఈవీవీ కి తీవ్రమైన అస్వస్థత ఎదురైంది అట. దీంతో ఆ నాలుగు రోజుల షూటింగ్ ని అల్లరి నరేష్ పూర్తి చేసి సకాలం లో సినిమా విడుదల అయ్యేలా చేసాడట. ఈ చిత్రాన్ని రామానాయుడు నిర్మించాడు. ఆరోజుల్లో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. అల్లరి నరేష్ కి ఆడియన్స్ లో మరింత ఇమేజ్ ని పెంచింది. ఇప్పటికీ కూడా టీవీ లో ఈ సినిమా వచ్చినప్పుడల్లా టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోతుంటాయి.