Mukku Avinash: జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన కమెడియన్స్ లో ఒకరు ముక్కు అవినాష్. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అవినాష్ కెరీర్ ని బిగ్ బాస్ ఎంట్రీ కి ముందు , ఆ తర్వాత అని డివైడ్ చేయొచ్చు. బిగ్ బాస్ షో తర్వాత అవినాష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఎంటర్టైన్మెంట్ షోలో ఆయనే ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఆదివారం టెలికాస్ట్ అయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. ఈ షో తో పాటు, అదే ఛానల్ లో అనేక ఈవెంట్స్ చేస్తూ ఫుల్ డిమాండ్ ఉన్న కమెడియన్ గా అవినాష్ కొనసాగుతున్నాడు.
అయితే ఎప్పుడూ సరదాగా ఉంటూ , అందరినీ నవ్విస్తూ ఉండే అవినాష్ జీవితం లో దారుణమైన విషాదం ఉందనే సంగతి మీకు ఎవరికైనా తెలుసా?.. 2024 వ సంవత్సరం లో అవినాష్ సతీమణి అనూజ్ గర్భం దాల్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి ఏమి పేరు పెట్టాలి, ఎలా చూసుకోవాలి అనే దానిపై తన యూట్యూబ్ చానెల్స్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ అడుగుతుండేవాడు. అలా ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డ కడుపులో ఉన్నప్పుడే చనిపోయింది. ఆ సమయం లో అవినాష్ పడిన మనోవేదన మాటల్లో వర్ణించలేనిది అట. డాక్టర్ల కాళ్ళు పట్టుకొని బ్రతికించమని బ్రతిమిలాడినా సందర్భాలను గుర్తు చేసుకుంటూ అవినాష్ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో ఎమోషనల్ అయ్యాడు. ఇకపోతే ఇంతకాలం కేవలం బుల్లితెర కి మాత్రమే ఎక్కువగా పరిమితం అవుతూ వచ్చిన అవినాష్. ఇప్పుడు నెమ్మదిగా సినిమా అవకాశాలను కూడా సంపాదిస్తున్నాడు. రీసెంట్ గానే శ్రీవిష్ణు హీరో గా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో అవినాష్ కీలక పాత్ర పోషించగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.