Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్' హౌస్ లో త్రిగున్ , వంశీ లకు...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ లో త్రిగున్ , వంశీ లకు చుక్కలు చూపిన నటరాజ్ మాస్టర్? దెబ్బకు మైండ్ బ్లాక్!

Bigg Boss 10 Telugu: నిన్న గాక మొన్ననే మొదలైనట్టుగా అనిపిస్తున్న ‘బిగ్ బాస్ 10’ అప్పుడే ప్రీ క్లైమాక్స్ కి చేరుకుంది. గత వారం ఎలిమినేషన్ లేకపోవడం తో , ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ ఎంట్రీ మంచి ఫైర్ మీద ఉందనే చెప్పొచ్చు. మొన్న ఆయన హౌస్ లోకి రాగానే నిర్మొహమాటంగా కంటెస్టెంట్స్ […]

Bigg Boss 10 Telugu: నిన్న గాక మొన్ననే మొదలైనట్టుగా అనిపిస్తున్న ‘బిగ్ బాస్ 10’ అప్పుడే ప్రీ క్లైమాక్స్ కి చేరుకుంది. గత వారం ఎలిమినేషన్ లేకపోవడం తో , ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ ఎంట్రీ మంచి ఫైర్ మీద ఉందనే చెప్పొచ్చు. మొన్న ఆయన హౌస్ లోకి రాగానే నిర్మొహమాటంగా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడిన మాటలు చూస్తే, ఈయన కదా బిగ్ బాస్ కి రావాలి, ఈ సీజన్ కి ఇతనే కరెక్ట్ అనే ఫీలింగ్ కలిగింది. వంశీ, త్రిగున్ వంటి వారు తన భార్య నీతూ మాస్టర్ పై తరచూ నోరు పారేసుకుంటూ ఉన్నారు. ఈ విషయంపై నటరాజ్ మాస్టర్ హౌస్ లోకి వస్తే పెద్ద గొడవలు తప్పేలా లేవని ప్రేక్షకులు ఊహించారు.

వాళ్ళ ఊహలకు తగ్గట్టుగానే నటరాజ్ మాస్టర్ మైండ్ సెట్ కూడా ఉంది. హౌస్ లోకి రాగానే వంశీ వద్ద ఆగి , అతని కళ్ళలోకి కళ్ళుపెట్టి అలా 30 సెకండ్స్ పాటు చూస్తూ ఉండిపోయాడు నటరాజ్ మాస్టర్. ఏంటి ఈయన ఇలా చూస్తున్నాడు?, కొట్టేస్తాడా ఏంటి? అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగింది. కానీ ఆ తర్వాత నార్మల్ గా మాట్లాడుతూ మీ అమ్మాయి నాకు చాలా నచ్చింది, అంతకు ముందు వరకు మీపై నా అభిప్రాయం వేరుగా ఉండేది, గొడవలు పెట్టుకోడానికే సిద్దమయ్యాను , కానీ మీ అమ్మాయికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను, నీ అదృష్టం బాగుంది, ఆడబిడ్డ పుట్టడమే ఒక అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్. ఇక త్రిగున్ కి అయితే నటరాజ్ మాస్టర్ నుండి నాన్ స్టాప్ పంచులు పడుతూనే ఉన్నాయి. మాస్టర్ మీకు టీ పెట్టి ఇవ్వమంటారా అని త్రిగున్ అడిగినప్పుడు , నన్ను నువ్వు ఏమార్చలేవు త్రిగున్ , నేను హోస్ట్ నాగార్జున లాగా మ్యానిప్యులేట్ అయిపోతానని అనుకున్నావా? అంటూ నటరాజ్ మాస్టర్ సెటైర్లు విసురుతాడు.

ఇక చివర్లో ఆయన రోహిత్ ని అన్యాయం గా పోటీలు పొడిచి బయటకు నెట్టేసిన సంఘటన గురించి, ఒక పిట్టకథ లాగా చెప్పాడు. ఒక అడవిలో నక్కలు , కుక్కలు, జింకలు , ఏనుగులు మరియు ఇతర జంతువులన్నీ ఉంటాయని, ఒక నక్క వాటిని చంపేసి , ఎముకలను తీసుకెళ్లి సింహం ముందు పెడుతుందని, అందరూ ఆ సింహమే వేటాడి చంపిందని అనుకొని, సింహాన్ని బయటకు పంపేశారని, చివరికి నక్క మిగిలిన వాళ్ళని కూడా మోసగించి చంపేస్తుందని, కాబట్టి ఆ నక్క తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హౌస్ లోని కంటెస్టెంట్స్ కి త్రిగున్ గురించి ఒక హింట్ ఇస్తాడు. త్రిగున్ కి పాపం ఆ సమయం లో నవ్వాలో , ఏడవాలో తెలియని పరిస్థితి. గత రెండు మూడు రోజులుగా ఫ్యామిలీ వీక్ లో వచ్చిన కుటుంబ సభ్యుల్లో కొంతమంది రోహిత్ కి జరిగిన అన్యాయం గురించి పరోక్షంగా నిలదీస్తూనే ఉన్నారు , దీంతో త్రిగుణ మళ్లీ రోహిత్ జపం చేయడం మొదలు పెట్టాడు. బయట తనపై ఎంత నెగెటివిటీ ఏర్పడిందో గ్రహించి , జనాలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే సోమవారం రోజున రోహిత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి నామినేషన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నామినేట్ చేస్తే ఎవరిని చేస్తాడు అనే అంశం పై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper