Pawan Kalyan: గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకుల వ్యవహారం గురించే చర్చ. భార్య భర్తల మధ్య మొదటి నుండి విబేధాలు ఉంటూ, ఒకవేళ విడిపోతే పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు కానీ , ఎంతో అన్యోయంగా ఉంటూ విడిపోయినప్పుడే జనాల్లో ఎక్కువ చర్చ నడుస్తాది. ప్రస్తుతం అదే జరుగుతోంది. రెండు నెలల క్రితం వరకు కూడా వీళ్లిద్దరు ఎంతో అన్యోయంగా గడపడం మన కళ్లారా చూసాము. ఇన్ స్టాగ్రామ్ లో అయితే అన్నా లెజినోవా యాక్టీవ్ గా తన భర్త గురించి పోస్టులు పెడుతూ ఉండేది. అయితే వీళ్లిద్దరి బంధం గురించి సోషల్ మీడియా లో ఒక వార్త లీకై బాగా వైరల్ అయ్యింది. అది విన్నాక ఇలా కూడా ఉంటారా అని మనకు అనిపించక తప్పదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా మానసికంగా 2023 వ సంవత్సరం లోనే విడిపోయారు అట. అధికారికంగా లీగల్ విడాకులు కూడా అప్పుడే చేసుకుందామని అనుకున్నారట. కానీ బీజేపీ పెద్దలు ఈ వ్యవహారం లో కలుగచేసుకొని విడాకులు అవ్వనివ్వకుండా ఆపారట. అప్పటి నుండి భార్య భర్తలుగా వీళ్లిద్దరు కలిసి ఉండకపోయినా , స్నేహితులుగా మాత్రం ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. అయితే వీళ్లిద్దరి మధ్య రీసెంట్ గా గొడవలు ఏర్పడడానికి కారణం మాత్రం , కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన నుండే అని అంటున్నారు విశ్లేషకులు. మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు పవన్ కళ్యాణ్ అరకు మీటింగ్ లో ఉన్నాడు. అక్కడి జనాలతో మాట్లాడుతూ , వాళ్ళ కష్టాలను తెలుసుకుంటున్నారు. సాధారణంగా ఆరోజు అరకు ప్రోగ్రాం ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాలి. కానీ పవన్ కళ్యాణ్ అది చెయ్యలేదు. సుమారుగా 3 గంటల పాటు అరకు లో మీటింగ్ ని నిర్వహించి , ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు.
ఇక ఆ తర్వాత రాత్రి సమయం లో సింగపూర్ కి బయలుదేరాడు. కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉంటే , అతని కోసం పవన్ కళ్యాణ్ 12 గంటలు ఆలస్యంగా వచ్చినందుకు అన్నా లెజినోవా మనసు చాలా నొచ్చుకుంది అట. సింగపూర్ కి వీళ్ళినప్పుడు వీళ్లిద్దరి మధ్య ఈ విషయం పై గొడవలు కూడా జరిగాయట. అప్పటి నుండి వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వస్తూనే ఉన్నాయని , పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ ని హైదరాబాద్ లో చదివిద్దామని పట్టు బడితే , అన్నా మాత్రం విదేశాల్లో చదివించాలని పట్టుబడిందని , ఇలాంటి వివాదాలు వీళ్లిద్దరి మధ్య జరుగుతూనే ఉండడం వల్ల చివరికి విడిపోయేందుకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, ఒకవేళ ఇదే నిజమైతే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.