Duvvada Srinivas And Madhuri Dance: కానీ ఇప్పటి నేతలు అలా లేరు. పైగా రాజకీయాలను ఇంటిదగ్గర దాకా తీసుకెళ్తున్నారు. ఇంట్లో వాళ్లను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో వారిని కూడా భాగస్వామ్యులను చేస్తున్నారు. ఇది మారిన పరిస్థితికి నిదర్శనం
అనుకోవాలా.. రాజకీయాలు ఇంత దారుణంగా మారిపోయాయి ఏంటి అని నెత్తి బాదుకోవాలా.. అనేది అర్థం కావడం లేదు…. అసలు రాజకీయాలలో కుటుంబ సభ్యులకు అవసరమేంటి.. కుటుంబ సభ్యుల పెత్తనం ఏంటి.. అనే ప్రశ్నలను నేతలు వేసుకోవడం లేదా.. పోనీ ఆ ప్రశ్నలు వాళ్లకు ఎదురైనప్పటికీ.. జనాలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నాం కాబట్టి చచ్చినట్టు భరించాల్సిందే అని అనుకుంటున్నారా.. వాస్తవ పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది.
ఇక రాజకీయాలలో ఇప్పటిదాకా కుటుంబ సభ్యుల పెత్తనం చూసాం. కుటుంబ సభ్యుల ఆధిపత్యం చూసాం. కానీ తొలిసారిగా రాజకీయాలలో ప్రియురాలి పెత్తనం చూస్తున్నాం. ఆమెను వెనకేసుకొస్తున్న ఆ రాజకీయ నాయకుడిని చూస్తున్నాం. ఆమె కోసం భార్యను, పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని వదిలేసిన నాయకుడిని చూస్తున్నాం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. మేము ఎవరి గురించి చెబుతున్నామో.. ఎస్ మీరు అనుకున్నది నిజమే.. ఈ ఉపోద్ఘాతం మొత్తం శ్రీనివాస్, మాధురి గురించే. రాజకీయాలలో ప్రియురాలికి పెత్తనం అప్పగించి.. ఆమె సేవలో తరిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్సీ .. ఆయన ప్రియురాలు.. ప్రతిరోజు వార్తల్లోనే ఉంటున్నారు. ఏదో ఒక రూపంలో వారు కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా మాధురి తన కుమార్తె హాఫ్ సారీ ఫంక్షన్ చేసింది. ఈ ఫంక్షన్ కు దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. ఫంక్షన్ భారీ హంగామా తో చేశారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి కలసి డ్యాన్స్ చేశారు. అలనాటి హిందీ పాటలకు అదే స్టైల్ లో కాస్ట్యూమ్స్ ధరించి స్టెప్పులు వేశారు.
ఇక వారిద్దరు డ్యాన్స్ చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలను కొంతమంది విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. వాస్తవానికి గత ఏడాది క్రితం శ్రీనివాస్ – మాధురి వ్యవహారం బయటపడింది. ఇక అప్పటినుంచి వారిద్దరు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయిపోయారు. మాధురీ ఏకంగా హైదరాబాదులో అత్యంత ఆధునికమైన చీరల దుకాణం ఓపెన్ చేసింది. దువ్వాడ శ్రీనివాస్ ను వైసిపి సస్పెండ్ చేసింది.దీంతో ఆయన అధిష్టానం పై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే రాజకీయాలను పార్ట్ టైమ్ గా మార్చుకున్న శ్రీనివాస్.. మాధురి తోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ప్రైవేట్ న్యూస్ చానల్స్ స్టూడియోలు తిరుగుతూ అంచనాలకు మించిన పబ్లిసిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికైతే ఏ పార్టీలో చేరాలి అనే విషయాన్ని శ్రీనివాస్ నిర్ణయించుకోలేదు. బహుశా ఆయన ఇండిపెండెంట్గా ఉంటారని.. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై శ్రీనివాస్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు మాధురి కూడా రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
దువ్వాడ శ్రీనివాస్, మాధురి రాకింగ్ డాన్స్..
తన కుమార్తె హాఫ్ శారీ వేడుకల్లో అదిరిపోయే స్టెప్స్ వేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి pic.twitter.com/CpeGN1Ilie
— BIG TV Breaking News (@bigtvtelugu) June 10, 2025