Water from Tree : నేటి ఆధునిక కాలంలోనూ మూఢ నమ్మకాలకు తావులేదు. మంత్రాలకు తంత్రాలకు కొదవలేదు. వీటిని చదువుకున్న వారు కూడా నమ్ముతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొన్ని విషయాలలో నమ్మాల్సి వచ్చినప్పటికీ.. అన్ని సందర్భాలలో ఇదే నమ్మకాన్ని కొనసాగిస్తూ ఉండడం ఒక రకమైన విస్మయాన్ని కలిగిస్తోంది.
Water from Tree : సాధారణంగా చెట్టు వేర్ల కింద నీళ్లు ఉంటాయి. చెట్లు తమ వృద్ధికి వేర్ల కింద నీటిని నిల్వ చేసుకుంటాయి. కాకపోతే ఆ నీరు ఎప్పుడు కూడా బయటికి రాదు. బయటికి వచ్చే అవకాశం కూడా లేదు. ఇంతవరకు చెట్టు వేర్ల నుంచి నీళ్లు వచ్చిన సందర్భం కూడా లేదు. కానీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలో పింప్రి – చించ్వాడ్ నగరంలో ఒక చెట్టు నుంచి ఉన్నట్టుండి నీళ్లు రావడం మొదలైంది. చెట్టు నుంచి నీళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇక కొందరైతే కొబ్బరికాయలతో.. పసుపు కుంకుమలతో ఆ చెట్టుకు పూజలు చేయడం మొదలుపెట్టారు. అగర్బత్తిలు ముట్టించి.. అమ్మవారు ఇక్కడ వెలసిందని.. ఆమెకు పూజలు చేయాలని కొంతమంది పుకార్లు పుట్టించారు. దీంతో ఇదంతా నిజమని.. అమ్మవారు వెలసిందని.. ఆమె మాయ వల్ల ఇలా నీళ్లు వస్తున్నాయని చాలామంది అనుకున్నారు. ఇక పూజలు, పునస్కారాలకు అయితే లెక్కలేకుండా పోయింది.
అయితే ఈ విషయం ఆ నగరంలోని పురపాలక శాఖ సిబ్బందికి తెలిసింది.. ఏం జరిగిందో తెలుసుకుందామని వారు అక్కడికి వెళ్లారు. ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత స్థానికులతో చర్చించారు. కొంతసేపు అక్కడి పరిస్థితులను గమనించిన తర్వాత రంగంలోకి దిగారు. వాస్తవానికి ఆ చెట్టు నుంచి నీరు వస్తున్నది నిజమే. స్థానికులు పూజలు చేస్తున్నది కూడా నిజమే. కాకపోతే అక్కడ నీళ్లు రావడం దేవుని మాయ కాదు. లక్ష్మీ దేవత వెలిసింది అంతకన్నా కాదు. ఎందుకంటే ఆ చెట్టు వేర్ల కింద నుంచి పురపాలక శాఖ తాగునీటి పైప్ లైన్ ఉంది. చాలా సంవత్సరాల క్రితమే ఆ పైప్ లైన్ నిర్మించారు. చెట్టు వేర్లు భూమిలోకి చుచ్చుకుపోవడం వల్ల పైపులైన్ ధ్వంసం అయింది. ఆ తర్వాత అక్కడినుంచి నీరు లీక్ అవ్వడం మొదలైంది. అందువల్లే చెట్టు వేర్ల నుంచి నీరు వస్తున్నట్లు అనిపిస్తున్నది. మొత్తానికి మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేకమైన యంత్రాల సహాయంతో రోడ్డును తవ్వి పైపులైన్ కు మరమ్మతులు నిర్వహించారు. ఆ తర్వాత నీరు రావడం ఆగిపోయింది. దీంతో స్థానికులు నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అయితే వేర్లనుంచి నీరు వస్తున్నంత సేపు కొబ్బరికాయలు కొట్టడానికి.. పూజలు చేయడానికి స్థానికులు పోటీపడ్డారు. ఇదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో దుకాణదారులు భారీగా వ్యాపారం చేసుకున్నారు.. పూలదండలను, అగర్బత్తిలను, కొబ్బరికాయలను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే మున్సిపల్ శాఖ అధికారులు అక్కడికి ఎంట్రీ ఇచ్చారో.. పరిస్థితి ఒక్కసారి గా మారిపోయింది. తర్వాత మాయ, మంత్రం లేదని తేలిపోయింది.
చెట్టు నుండి నీళ్లు రావడంతో దేవుడి మాయ అనుకొని పూజలు చేసిన స్థానికులు, చెట్టు కింద పైప్ లైన్ లీక్ అయిందని నిర్ధారించిన మున్సిపల్ అధికారులు
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో పింప్రి-చించ్వాడ్ నగరంలో ఒక చెట్టు నుండి ఉన్నట్టుండి నీళ్ళు రావడంతో చెట్టుకి పూజ చేసి, చెట్టు నుండి వస్తున్న… pic.twitter.com/LCzNSEfM6E
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2025