Sakshi office fire : ఆంధ్రప్రదేశ్ లో సూపరిపాలనకు మొదటి సంవత్సరం ముగిసింది. రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధిని, సంక్షేమాన్ని జరుపుకుంటున్న వేళ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త కుట్రకు తెరలేపాడని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో తాడేపల్లి తన నివాసం వద్ద తానే నిప్పు పెట్టించుకుని, అనంతరం తెలుగుదేశంపైన నిందారోపణలు చేసిన జగన్.. ఈసారి అదే స్క్రిప్ట్‌ను ఏలూరులో మరోసారి ఆడించాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏలూరులో ఉన్న సాక్షి కార్యాలయానికి తాము నిప్పు పెట్టించి, దాన్ని టీడీపీ, అమరావతి మహిళలపై నెట్టాలని జగన్ ఆలోచన అంటున్నారు.
ప్రజలు పండుగలా జరుపుకుంటున్న సూపరిపాలన వేడుకలకు కళంకం చిందించాలన్న ప్రయత్నమే ఇది అని టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల అమరావతి మహిళలపై వైసీపీ నేతలు చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ ఉదంతాన్ని మరిచిపెట్టించేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ డ్రామా విజయవంతం చేయాలని జగన్ కొత్త కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు.
గతంలో తాడేపల్లిలో జరిగిన ఘటనలోనూ సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు రాలేదు. ఇప్పుడు కూడా ఏలూరులోని సాక్షి కార్యాలయ ఘటనలో సీసీ ఫుటేజ్ మాయం కావడం ఏం సూచిస్తుంది? ఇదేనా నిజమైన దర్యాప్తు? ఇదేనా ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వ నిర్వహణ? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.
రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటున్నారు. కుట్రలు పన్నే జగన్, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన జగన్ తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకుంటున్నాడని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. అసభ్యకర వ్యాఖ్యలు, దాడులు, తప్పుడు ఆరోపణలు, డ్రామాలు.. ఇవన్నీ ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతోంది.
ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు, సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు, స్థిరత్వం కోరుకుంటారు. కానీ జగన్ వాటి బదులు నాటకాలకు, కుట్రలకు, చీప్ పాలిటిక్స్‌కి ఓటు వేయరని స్పష్టంగా వెల్లడవుతోందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది.
వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల గళాన్ని వినాలి. కుట్రలకు ముగింపు పలకాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ మంచి పరిపాలన కోరుకుంటారు. తప్పుడు డ్రామాలు, దుష్ప్రచారాలు, కుట్రలు ఎక్కువ కాలం నడవవు. నిజం వెలుగులోకి వచ్చిందే తీరుతుందని.. సాక్షి కార్యాలయం దహనం ఒక కుట్ర అని టీడీపీ ఆరోపిస్తోంది.ఇందుకు సంబంధించిన పలు వీడియోలను టీడీపీ తాజాగా విడుదల చేసింది.
ఏలూరులోని ‘సాక్షి’ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు
ఆఫీసులో తగలపడిపోయిన ఫర్నిచర్
ఆఫీసు ముందు ఉన్న కారును సైతం ధ్వంసం చేసిన దుండగులు
ఇది టీడీపీ నేతల పనే అని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు
ఈ ఘటనకు తమతో సంబంధం లేదని, ర్యాలీగా వెళ్తుంటే తమపై నిందలు మోపుతున్నారని తెలిపిన టీడీపీ… pic.twitter.com/AlsvO0gqAX
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2025