spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Aravind On Balagam: బలగం మూవీని మెచ్చుకోలేకపోతున్న అల్లు అరవింద్... దానికి బలమైన కారణమే...

Allu Aravind On Balagam: బలగం మూవీని మెచ్చుకోలేకపోతున్న అల్లు అరవింద్… దానికి బలమైన కారణమే ఉంది!

Allu Aravind On Balagam
Allu Aravind On Balagam

Allu Aravind On Balagam: సాధారణంగా చిన్న సినిమాలు విజయం సాధిస్తే నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా అభిమానిస్తారు. ఆ సినిమాతో ఆయనకు సంబంధం ఉన్నా లేకున్నా… పరిశ్రమకు చెందిన మూవీగా భావించి ప్రోత్సాహం ఇస్తారు. గతంలో పలు చిన్న హీరోలు, సినిమాల సక్సెస్ ని ఆయన అభినందించారు. అయితే బలగం విషయంలో ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు.బలగం అంత పెద్ద విజయం సాధించినా ఒక్క మాట మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఒక్క కామెంట్ చేయలేదు. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం అద్భుతాలు చేస్తుంది.

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. గత యాభై రోజులుగా బలగం గురించి చర్చ నడుస్తూనే ఉంది. గ్రామాల్లో బహిరంగ ప్రదర్శలు వేసుకుని మరీ జనాలు చూస్తున్నారు. తొమ్మిది అంతర్జాతీయ అవార్డ్స్ బలగం మూవీ సొంతం చేసుకుంది. ఇంతటి అరుదైన చిత్రాన్ని అల్లు అరవింద్ పట్టించుకోకపోవడం చర్చకు దారితీసింది. అయితే దానికి బలమైన కారణమే ఉందని టాలీవుడ్ వర్గాల వాదన.

దిల్ రాజుతో ఏర్పడిన విభేదాల కారణంగానే అల్లు అరవింద్ బలగం టీమ్ ని అభినందించలేకపోతున్నారట. గతంలో దిల్ రాజు, అల్లు అరవింద్ మంచి మిత్రులు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కంట్రోల్ చేస్తున్న ఆ నలుగురిలో ఈ ఇద్దరు ప్రముఖులు. ఆ విధంగా దిల్ రాజు, అల్లు అరవింద్ మధ్య సాన్నిహిత్యం ఉండేది. ఇటీవల దిల్ రాజు చర్యతో అది చెడింది. తాను అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న కాంబోలో దిల్ రాజు మూవీ ప్రకటించడం వివాదానికి దారితీసింది.

Allu Aravind On Balagam
Allu Aravind On Balagam

పరుశురాం దర్శకుడిగా విజయ్ దేవరకొండలతో మూవీ చేయాలని అల్లు అరవింద్ భావించాడు. తనకు ఓ మూవీ చేసి పెట్టమని పరుశురాం కి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అల్లు అరవింద్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న పరుశురాం దిల్ రాజుతో మూవీకి కమిట్ అయ్యాడు. దిల్ రాజును ఏమీ అనలేని అల్లు అరవింద్ దర్శకుడు పరశురామ్ పై ఫైర్ అయ్యాడు. అసలు ప్రెస్ మీట్ పెట్టి పరశురామ్ దిల్ రాజులను ఏకిపారేయాలని డిసైడ్ అయ్యాడు. పరుశురాం ఆయన ఇంటికెళ్లి ప్రసన్నం చేసుకోవడంతో అప్పటికి శాంతించాడు. ఈ వివాదం నేపథ్యంలో దిల్ రాజు నిర్మించిన బలగం మూవీ గురించి అల్లు అరవింద్ మాట్లాడలేదంటున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper