Homeఎంటర్టైన్మెంట్Agadha Movie Review: 'అగధ' ఫుల్ మూవీ రివ్యూ... బొమ్మ హిట్టా ఫట్టా...

Agadha Movie Review: ‘అగధ’ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా ఫట్టా…

Agadha Movie Review: సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఎమ్మెస్ రాజు చేసిన అగధ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… కథ ఒక ఊరిలోని ఒక గుహ లో అగధ అనే ఒక నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడికి […]

Agadha Movie Review: సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఎమ్మెస్ రాజు చేసిన అగధ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఒక ఊరిలోని ఒక గుహ లో అగధ అనే ఒక నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా నష్టం జరుగుతుంది అని చెబుతుంటారు. ఇక అనుకోకుండా మన హీరోయిన్ వాళ్ల ఫ్యామిలీ కొన్ని వీడియోలు షూట్ చేసుకోవడానికి ఆ గుహలోకి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి వచ్చారో అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ లో కొందరు అనుకోని పరిస్థితిలో చనిపోతుంటారు. నిజానికి ఆ చావులకు అగధ కి మధ్య సంబంధం ఏంటి? అసలు అగధ అంటే ఎవరు? ఆమె గుహలోకి వచ్చిన వారిని ఎందుకు ఇబ్బంది పెడుతుంది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశేషణ

దర్శకుడు ఎమ్మెస్ రాజు ఈ సినిమాని హార్రర్ మూవీ గా ప్రజెంట్ చేస్తూ వచ్చాడు. టీజర్, ట్రైలర్లో కొన్ని షాట్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తినైతే రేకెత్తించాయి. నిజానికి సినిమా స్టార్ట్ అయిన ఒక పది నిమిషాలకు అగధ ఎవరు అనే విషయం మీద ప్రతి ఒక్కరు ఒక పవర్ ఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు అగధ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ సినిమాలోకి వెళ్తున్న కొద్ది ఏదొక విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఎక్కడ కూడా నీకు హార్రర్ గొలిపే అంశాలైతే కనిపించవు… ఎంతసేపు సినిమాలో అగధ అనే పేరు వినిపిస్తుంది. కానీ దాని తాలూకు ఇంపాక్ట్ ను చెప్పే ప్రయత్నం చేశారు.

కానీ ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత అగధ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకు ఎంగేజింగ్ గా అనిపించే ఒక్క హార్రర్ ఎలిమెంట్ కూడా వర్కౌట్ అవ్వలేదు. హార్రర్ సినిమాగా ప్రొజెక్ట్ చేసిన ప్రతి సినిమాలో ఒకటి రెండు ఎలిమెంట్స్ అయిన కూడా హార్రర్ ఫీల్ ఇచ్చే విధంగా ఉండాలి. లేకపోతే సినిమాని చూసే ప్రేక్షకులు చాలా వరకు డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అందులోను తెలుగు సినిమా ఇండస్ట్రీలో హార్రర్ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి… ఇంతకుముందు మసూదా అనే ఒక హార్రర్ సినిమాలోనే ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా నిలిచిపోయింది. దాని తర్వాత ఆ రేంజ్ సినిమా అయితే రాలేదు. మరి అగధ అలాంటి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిరాశే మిగిలిందని చెప్పాలి. అక్కడక్కడ ఓకే అనిపించినప్పటికి ఓవరాల్ గా సినిమాలో మాత్రం పెద్దగా మ్యాటర్ అయితే లేదు.

ఈ సినిమా విషయంలో ట్రైలర్ టీజర్లను చాలా బాగా కట్ చేయించుకున్న దర్శకుడు కథను పెర్ఫెక్ట్ గా బ్లెండ్ చేయడంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోతున్నారు. ఇక ఈ సినిమా పరిస్థితి కూడా అలాగే మారింది. బ్యా గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఇంపాక్ట్ ను చెప్పే ప్రయత్నం చేసిన కూడా కోర్ ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు… ఇక అగధ చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంగేజింగ్ అనిపించిన కూడా ఆ అగధ ఎవరు అనేది రివిల్ అయిన తర్వాత ఆ గుహలో అగధ ను చూసిన ప్రతి ఒక్కరికి తను ఏంటి ఇలా ఉంది అనే ఒక డౌట్ కలుగుతుంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఈ మూవీలో లీడ్ రోల్ లో కామాక్షి భాస్కర్ల నటించారు…ఆమె యాక్టింగ్ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది… ప్రతి సన్నివేశంలో ఆమె పెర్ఫెక్ట్ గా నటించింది. శ్రావణ్ రెడ్డి నటన కూడా ఒకే అనిపించింది. ఉల్క గుప్తా క్యారెక్టర్ లో చాలా మంచి డెప్త్ ఉంది… ఆమె కూడా పర్లేదు అనిపించేలా యాక్టింగ్ చేసింది… మిగిలిన నటీనటులందరూ వల్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

రాకేష్ వెంకటాపురం ఇచ్చిన మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ముఖ్యంగా సినిమా మొత్తానికి వాడినా కలర్ పాలెట్ కూడా బాగుంది. విజువల్స్ కూడా చాలా రీచ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసి చేశారు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఒకే అనిపించేలా ఉన్నాయి… జునైద్ సిద్ధికి ఎడిటింగ్ వర్క్ బాగుంది. ఎక్కడ కూడా పెద్దగా లాగ్ చేయకుండా సీన్ లోని డైటిలైంగ్ చెడిపోకుండా కోర్ ఎమోషన్ ను వర్కౌట్ చేయడంలో ఎడిట్ వర్క్ హెల్ప్ వరకు హెల్ప్ అయింది…

ప్లస్ పాయింట్స్

కామాక్షి భాస్కర్ల యాక్టింగ్
ఎడిటింగ్
ఫస్ట్ 10 మినిట్స్

మైనస్ పాయింట్స్

హార్రర్ సీన్స్ పెద్దగా లేవు…
కథ అంత ఎఫెక్టివ్ గా లేదు…
ఎమోషనల్ కనెక్టివిటీ లేదు…

రేటింగ్ : 2/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper