Bandla Ganesh: రీసెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అతి చిన్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie) బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ నెల 25 వరకు థియేట్రికల్ రన్ బాగా ఉండే అవకాశాలు ఉండడం తో కచ్చితంగా 40 కోట్ల మార్కుని అందుకుంటుంది అనుకోవచ్చు. మౌళి(Mouli) లాంటి ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ హీరో గా నటించిన సినిమా జనాల్లోకి ఈ రేంజ్ లో వెళ్ళడానికి కారణం ఆ సినిమా కంటెంట్ ప్రధాన కారణం అయితే, మరో కారణం బన్నీ వాసు అని చెప్పొచ్చు. ఆయన ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేసాడు.
సినిమా పెద్ద హిట్ అవ్వడం తో నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్ చేయగా, ఈ ఈవెంట్ కి మూవీ టీం తో పాటు అల్లు అరవింద్(Allu Aravind) కూడా పాల్గొన్నాడు. బండ్ల గణేష్(Bandla Ganesh) కూడా ఈ ఈవెంట్ లో తన వంతు భాగాన్ని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకొచ్చిన వంశీ మరి బన్నీ వాసు ని ప్రత్యేకంగా అభినందించాలి. రెండు కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ఈ సినిమాని గ్రాండ్ గా విడుదలయ్యేలా చేశారు. మీరు ఎంత కష్టపడి పని చేసినా ఇది అరవింద్ గారి సినిమా అని అంటున్నారు. అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. ఇంకేమి చెప్పలేను.అల్లు అరవింద్ గారు ఏమి చెయ్యరు, చివరి నిమిషం లో వస్తాడు, ఆహా అంటాడు, పేరు కొట్టేస్తాడు, ఆయన జాతకం అట్లాంటిది, మనమేమి చేయలేము దానికి’ అని అంటాడు. పాపం బన్నీ వాసు అల్లు అరవింద్ పక్కనే కూర్చొని ఉంటాడు, నేనేమి చెయ్యలేదు బాబోయ్ , ఆయనే ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ సైగలు చేస్తాడు.
ఇది అల్లు అరవింద్ కూడా చాలా ఫన్నీ గానే తీసుకున్నాడు, అందరూ బాగానే నవ్వుకున్నారు కానీ, బండ్ల గణేష్ మాట్లాడింది వాస్తమే కదా అని ప్రతీ ఒక్కరికి అనిపించింది. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్ లో మాత్రమే బాగా హైలైట్ అయ్యే బండ్ల గణేష్, ఈసారి లిటిల్ హార్ట్స్ మూవీ ఈవెంట్ ద్వారా బాగా హైలైట్ అయ్యాడు. చాలా కాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చిన బండ్ల గణేష్, మధ్యలో రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ సినిమాలను నిర్మించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు కానీ, స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా అంటూ అందరూ పెద్ద పెద్ద సినిమాలకు కమిట్ అయ్యారు. దీంతో బండ్ల గణేష్ కి కష్టమైంది.
అల్లు అరవింద్ ఏం చెయ్యడు.. లాస్ట్‌లో వస్తాడు క్రెడిట్స్ వేసుకుంటాడు
లిటిల్ హార్ట్స్ సినిమా తీసినందుకు బన్నీ వాసుకు, వంశీ నందిపాటికి అభినందనలు – లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఫంక్షన్లో బండ్ల గణేష్ pic.twitter.com/4bLezX77sh
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2025