mega family : ఒకప్పుడు మెగా ఫ్యామిలీ లో ఎలాంటి వ్యత్యాసాలు ఉండేవి కాదు. చిరంజీవి(Megastar Chiranjeevi), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మరియు రామ్ చరణ్(Global Star Ram Charan) ఇలా అందరూ ఒకేలాగా ఉండేవారు. అభిమానులు కూడా అందరినీ సమానంగా అభిమానించే వాళ్ళు. కానీ ఈమధ్య కాలం లో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కి దూరం అయ్యిందని, అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు వచ్చాయని, అదే విధంగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టడం అల్లు అర్జున్ కి అసలు నచ్చలేదని, అప్పటి నుండి ఆయన మెగా ఫ్యామిలీ కి పూర్తిగా దూరమయ్యాడని, ఇలా ఎన్నో రకాల అపోహలు, అనుమానాలు మెగా ఫ్యాన్స్ లో ఉండేవి. ఒకవేళ వాళ్ళ మధ్య విబేధాలు ఉన్నా లేకపోయినా, వాళ్లంతా ఒకే ఫ్యామిలీ. ఏ చిన్న సందర్భం వచ్చినా అందరూ ఏకం అయిపోతారు. రీసెంట్ గానే అల్లు అరవింద్ తల్లి అల్లు కానక రత్నమ్మ తన తుది శ్వాస విడిచింది.
ఆమె అంత్యక్రియలను మెగా ఫ్యామిలీ మొత్తం దగ్గరుండి ఎలా పూర్తి చేశారో మనమంతా సోషల్ మీడియా లో వీడియోల ద్వారా చూశాము. అంత్యక్రియలకు మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఆరోజున జనసేన పార్టీ భారీ బహిరంగ సభ ఉండడం వల్ల హాజరు కాలేకపోయాడు. కానీ సభ పూర్తి అయ్యాక అల్లు ఫ్యామిలీ ని కలిసి తన సంతాపం వ్యక్తం చేసి వెళ్ళాడు. ఇకపోతే నేడు అల్లు కనకరత్నమ్మ పెద్ద కర్మ అవ్వడం తో మెగా ఫ్యామిలీ మొత్తం మళ్లీ ఏకం అయ్యింది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా తన కొడుకు అకిరా నందన్ తో కలిసి ఈ కార్యక్రమం లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ముగ్గురు కలిసి ఒక చోట కూర్చున్న వీడియో అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది.
ఇలాంటి ఫ్రేమ్ కోసం మేము ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నాము, చివరికి ఇప్పుడు కుదిరింది అంటూ ఎమోషనల్ గా ట్వీట్లు వేస్తున్నారు. అదే విధంగా అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ హత్తుకోవడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అకిరా నందన్ ని పలకరించడం వంటి విజువల్స్ అభిమానులకు కనుక పండుగ లాగా అనిపించింది. సోషల్ మీడియా లో చాలా కాలం నుండి మెగా మరియు అల్లు అంటూ రెండు గ్రూప్స్ గా విడిపోయి ఒకరిపై ఒకరు సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ వేసుకోవడం వంటివి మనం ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఈమధ్య కాలం లో జరిగిన ఈ సంఘటనల కారణంగా మెగా మరియు అల్లు ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ కాస్త తగ్గాయి. శాశ్వతంగా ఈ ఫ్యాన్ వార్స్ ఆగిపోయాయా అంటే ముమ్మాటికీ కాదు అనే చెప్పాలి. మళ్లీ ఎదో ఒక సందర్భం లో వీళ్ళు కొట్లాడుకోవడం మొదలు పెడుతారు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#PawanKalyan & #RamCharan attended the Pedda Karma of #AlluKanakaratnam garu #AlluArjun #AkiraNandan #TeluguFilmNagar pic.twitter.com/R1icSBxyVk
— Telugu FilmNagar (@telugufilmnagar) September 8, 2025