Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరై ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ఈనెల 17 నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఆరోజు నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి. భోగాపురంలో పూర్తిస్థాయి సర్వీసులు ప్రారంభం అవుతాయి. అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. అది కూడా చార్టెడ్ ఫ్లైట్ కావడం విశేషం.
* ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం..
దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ విమానంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చారు. భోగాపురం విమానాశ్రయంలో అడుగు పెట్టారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాలకు సర్వం సిద్ధమైనట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈనెల 17 తర్వాత భోగాపురం నుంచి సాధారణ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని ఇప్పటికే పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ రన్ వే సన్నద్ధత, ఇతర నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఎంపీ తో పాటు ఎమ్మెల్యే ప్రత్యేక విమానంలో వచ్చారు. దీంతో ఎయిర్పోర్ట్లో సందడి నెలకొంది.
* అన్ని దేశాలకు కనెక్టివిటీ..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు అన్ని దేశాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. విశాఖ నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ నావి ఆధీనంలోకి వెళ్ళనుంది. మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో పౌర విమానయాన శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ నగరానికి 45 కిలోమీటర్ల లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నిర్మించిన మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఎయిర్పోర్టులో చార్టెడ్ ఫ్లైట్ ల్యాండింగ్ కావడం.. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram