Allu Aravind Comments On Bandla Ganesh: నోటికి ఎదోస్తే అది మాట్లాడే స్టార్ సెలబ్రిటీలతో ఒకరు బండ్ల గణేష్(Bandla Ganesh). ఒక సాధారణ కమెడియన్ స్థాయి నుండి టాలీవుడ్ లో టాప్ స్టార్స్ ని పెట్టి సినిమాలను నిర్మించే స్థాయికి ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. నూటికో కోటికో ఒకరికి దక్కుతుంది ఇలాంటి అదృష్టం. అలాంటి స్థాయి ని సంపాదించుకున్న బండ్ల గణేష్ కి ఏమైందో ఏమో తెలియదు కానీ, 2015 లో విడుదలైన టెంపర్ చిత్రం తర్వాత సినిమాలను నిర్మించడమే మానేసాడు. టెంపర్ మంచి హిట్ సినిమానే కదా?, ఎందుకు పదేళ్ల నుండి ఈయన సినీ ప్రస్థానం ముందుకు కదలడం లేదో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మళ్లీ నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ, ఈమధ్య కాలం లో ప్రతీ చిన్న సినిమా సక్సెస్ ఈవెంట్ లో అతిథి పాల్గొంటున్నాడు.
ఇక ఆ ఈవెంట్ లో ఆయన చేసే కామెంట్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి, ఆయా నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న బండ్ల గణేష్, బన్నీ వాసు ని పొగుడుతూ, గీత ఆర్ట్స్ లో అల్లు అరవింద్ చేసేది ఏమి లేదు, అంతా నువ్వే పని చేస్తావ్, కానీ క్రెడిట్ మాత్రం ఆయన దొబ్బేస్తాడు అంటూ అల్లు అరవింద్ ని ముందు కూర్చోబెట్టుకొని ఈ మాట మాట్లాడుతాడు. దీనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నిర్మాత బన్నీ వాసు కూడా బండ్ల గణేష్ వ్యాఖ్యలను ప్రతీ ఇంటర్వ్యూ లో తప్పుబట్టాడు. అయితే నేడు అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సంస్థ ద్వారా నిర్మించబడ్డ ‘ది లిటిల్ హార్ట్స్’ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అరవింద్ ని రిపోర్టర్స్ పలు ప్రశ్నలు అడుగుతారు.
అందులో ఒక రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘బండ్ల గణేష్ ఒక ఈవెంట్ లో మీ గురించి మంచిగా మాట్లాడుతూనే, లాస్ట్ మినిట్ లో వచ్చి క్రెడిట్ తీసుకుంటాడు అని వ్యంగ్యంగా మాట్లాడిన మాటలకు మీరు బాగా బాధపడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇది నిజమేనా’ అని అడగ్గా, దానికి అల్లు అరవింద్ సమాధానం చెప్తూ ‘దానికి సమాధానం చెప్పడానికి నాకో స్థాయి ఉంది, అందుకే చెప్పడం లేదు’ అంటూ ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చాడు. ఈ రేంజ్ లో సమాధానం చెప్పాడంటే, అల్లు అరవింద్ కి ఎంత కోపం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ ని మీరు కూడా చూసేయండి.
రిపోర్టర్: #BandlaGanesh అన్న మాటలకి మీరు బాగా హర్ట్ అయ్యారు అని భోగట్టా.#AlluAravind: నాకు ఒక స్థాయి ఉంది.. సమాధానం చెప్పనక్కర్లేదు.#TheGirlFriend #RashmikaMandanna #Tollywood #Tupaki pic.twitter.com/Mrv0GxH4uz
— Tupaki (@tupaki_official) November 5, 2025