Minister Cash Controversy: విదేశాలలో ఉన్న మనవాళ్లు ఇండియాకు డబ్బులు పంపిస్తుంటారు. ఇది ఎప్పటినుంచో జరుగుతున్నది. కానీ ఆ మంత్రి గారు దీనిని మార్చేశారు. ఏకంగా తెలంగాణ నుంచి విదేశాలకు డబ్బులు తీసుకెళ్లారు. అదికూడా కట్టల కొద్దీ నోట్లతో వెళ్లారు. చివరికి అడ్డంగా దొరికిపోయారు.
ఆ మంత్రి మీద అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన భార్య ఏకంగా రంగంలోకి దిగి కమిషన్ ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తారని అభియోగాలు ఉన్నాయి. పైగా ఆయన నీతి వాక్యాలు చెప్పడంలో దిట్ట. తనకు తాను సంఘసంస్కర్తను అని చెప్పుకుంటారు. కానీ లోపల మాత్రం కమిషన్లు లాగుతూ ఉంటారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రి పర్సంటేజ్ మినిస్టర్ అవతారం ఎత్తారు. కీలకమైన శాఖలను ఆయన తన వద్ద పెట్టుకున్నారు. అందులో భారీగా కాంట్రాక్టులు.. బిల్లులను మంజూరు చేయడానికి కమిషన్లు వసూలు చేయడం ప్రారంభించారు. ఈయనకు 30% కమిషన్ మినిస్టర్ గా పేరుంది. దీన్నిబట్టి సదరు మంత్రివర్యుల వసూళ్ల స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మంత్రిగారి భార్య వసూళ్ల వ్యవహారాన్ని చక్కబెడతారని సమాచారం. మీడియం, బిలో మీడియం అమౌంట్లు మొత్తం సదరు మంత్రిగారి భార్యనే సెటిల్ చేస్తారు. హై రేంజ్ అమౌంట్ ను మాత్రమే మంత్రిగారు చూసుకుంటారు. ఇక ఇటీవల ఆ మంత్రి గారు విదేశాలకు వెళ్లారు. అక్కడికి వెళుతూ భారీగా డబ్బులను తీసుకెళ్లారు. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలో అడ్డుకోవడంతో మంత్రిగారికి ఒక్కసారిగా షాక్ తగిలింది. సుమారు గంటన్నర పాటు ఆయన విమానాశ్రయంలోనే కూర్చోవలసి వచ్చింది..”ఇంత భారీ స్థాయిలో డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. ఎందుకు తీసుకెళ్తున్నారు.. ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు వంటి ప్రశ్నలు అక్కడి విమానాశ్రయ అధికారులు వేసినట్టు సమాచారం..
అంత భారీ స్థాయిలో డబ్బు తీసుకెళ్లడం పట్ల విమానాశ్రయ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సదరు మంత్రిని విమానాశ్రయంలోనే నిలిపివేశారు. మంత్రికి ఆహ్వానం పలకడానికి వచ్చిన వారంతా ఈ ఘటన గురించి తెలుసుకొని షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత అక్కడివారు విమానాశ్రయ అధికారులను ఒప్పించడంతో.. ఆ డబ్బు తీసుకెళ్లడానికి లైన్ క్లియర్ అయింది. అయితే ఆ డబ్బును సదరు మంత్రి అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు.. దాంతో ఏం చేయబోతున్నారనేది.. ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఓ వర్గం మీడియా దీనిని దాచే ప్రయత్నం చేసినప్పటికీ సోషల్ మీడియా స్ట్రాంగ్ కదా..ఎలా దాగుతుంది..మొత్తానికి అంతా తెలిసిపోయింది.
image.png