
Mahesh Babu- Rajamouli: ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుందని ఈమధ్యనే మహేష్ బాబు ఫస్ట్ లుక్ తో అధికారికంగా తెలియచేసారు. ఈ చిత్రం పూర్తి అవ్వగానే మహేష్ బాబు రాజమౌళి తెరకెక్కించబోయ్యే సినిమాలో నటించబోతున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వగానే రాజమౌళి మహేష్ తో ఒక లాంగ్ వర్క్ షాప్ ని నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాప్ సుమారుగా ఆరు నెలల పాటు కొనసాగుతుంది అట. ఇందులో మహేష్ లుక్ ఎలా ఉండాలి,మరియు సినిమాకి ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడాలి, ఎలాంటి సెట్స్ వెయ్యాలి వంటి వాటి గురించి ఈ వర్క్ షాప్ ఉంటుందట.
ఇండియా లో తెరకెక్కబోతున్న మొట్టమొదటి యాక్షన్ అడ్వెంచర్ సినిమా అని ఇదివరకే రాజమౌళి తెలిపాడు.ఈ చిత్రానికి VFX వర్క్ రాజమౌళి ముందు సినిమాలకంటే కూడా అధిక శాతం ఉంటుందట. అందుకు ఎలాంటి షాట్స్ వాడాలి అనే దానిపై కూడా ఈ వర్క్ షాప్ లో చర్చలకు రాబోతుందని తెలుస్తుంది.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఒక మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ని మెంటలెక్కిపొయ్యేలా చేస్తుంది. అదేమిటంటే ఈ చిత్రాన్ని రాజమౌళి మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడట.

ఇది వరకు ఆయన బాహుబలి కి మాత్రమే సిరీస్ గా పని చేసాడు.ఆ చిత్రం తర్వాత మహేష్ తోనే సిరీస్ ప్లాన్ చెయ్యబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజమౌళి తో సినిమా అంటే కనీసం మూడేళ్ళ సమయం పడుతుంది. అలాంటిది మూడు సినిమాలు వరుసగా అంటే మరో పదేళ్లు మహేష్ రాజమౌళి తో మాత్రమే ప్రయాణం చెయ్యబోతున్నాడు అన్నమాట.