Homeటాప్ స్టోరీస్The Paradise: ది ప్యారడైజ్ పై ట్రోల్స్.. ఇచ్చి పడేసిన నాని..

The Paradise: ది ప్యారడైజ్ పై ట్రోల్స్.. ఇచ్చి పడేసిన నాని..

The paradise: ది ప్యారడైజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది విశ్లేషకులు సినిమా బాగాలేదని చెప్పారు. మరికొందరేమే బాగుందని చెప్పారు. ఇంకొందరేమో సినిమా ఒక స్థాయిలో ఉందని వివరించారు. ఇలా ఎవరికివారు తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. నాని కి క్లాస్ హీరోగా పేరుంది. ఈయన నటించిన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో నాని మాస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. దసరా.. సరిపోదా […]

The paradise: ది ప్యారడైజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది విశ్లేషకులు సినిమా బాగాలేదని చెప్పారు. మరికొందరేమే బాగుందని చెప్పారు. ఇంకొందరేమో సినిమా ఒక స్థాయిలో ఉందని వివరించారు. ఇలా ఎవరికివారు తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు.

నాని కి క్లాస్ హీరోగా పేరుంది. ఈయన నటించిన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో నాని మాస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. దసరా.. సరిపోదా శనివారం.. ఇప్పుడు the paradise. ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో కనిపించారు. సరిపోదా శనివారం మినహా మిగతా రెండు సినిమాలలో తెరమీద రక్తపాతం బీభత్సంగా జరిగింది. డైలాగులు.. నరుక్కోవడాలు.. తుపాకులు పేల్చడాలు.. ఒక స్థాయిని దాటిపోయాయి. వాస్తవానికి ఈ సినిమాలను చూస్తుంటే ఇవి నాని సినిమాలేనా అని అందరికీ అనిపించింది. వాస్తవానికి నాని మోస్ట్ ప్రామిసింగ్ హీరో. కాకపోతే ఆయనకి ఫ్యామిలీ స్టార్ అనే బిరుదు ఉంది. అయితే తనకు అన్ని జానర్లు చేయాలని ఉందని నాని పదే పదే చెప్పేవారు. అందువల్లే హిట్ 3, దసరా.. తాజాగా ది ప్యారడైజ్ సినిమాలు చేశారు.

ది ప్యారడైజ్ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు వస్తున్న నేపథ్యంలో నాని తొలిసారిగా స్పందించారు. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 70 కోట్ల వరకు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. టైర్ 2 సెగ్మెంట్లో ఉన్న నాని ఈ స్థాయి దాక రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక దశలో ఆయన సినిమాలు విడుదలయితేనే గొప్ప అనుకునే దగ్గరనుంచి.. నేడు ఆయన సినిమా కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగారు. దీనిని బట్టి నాని రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే నాని తన సినిమా మీద వస్తున్న విమర్శల మీద స్పందించారు..” ఈ సినిమాను ఓన్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు. కాకపోతే ఈ సినిమా మీద రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. చాలామంది లోపాల గురించి చెబుతున్నారు. వాటిని కచ్చితంగా సవరించుకుంటాం. ఈ చిత్రానికి వస్తున్న కామెంట్స్ ని ఆస్వాదిస్తున్నాం. మూడు సంవత్సరాల పాటు రక్తాన్ని చెమటగా మార్చి ఈ సినిమాని తీసాం. ఈ సినిమా కచ్చితంగా మా అంచనాలను అందుకుంటుంది. సినిమాను తిడుతున్న వారికి.. సినిమాను మెచ్చుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు” అంటూ నాని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర సరిగ్గా లేదని.. మోహన్ బాబు విలనిజం సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదని.. బాండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం వల్లే సినిమా ఇలా అయిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మాదిరిగా సెకండ్ హాఫ్ కూడా ఉండి ఉంటే సినిమా ఫలితం ఎక్కడికో వెళ్లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సెకండ్ హాఫ్ కూడా గ్రిప్పింగ్ లెవెల్ లో ఉంటే సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper