Homeటాప్ స్టోరీస్Nani: నాని నన్ను తిట్టాడు.. భయానక అనుభవాన్ని బయటపెట్టిన శ్రీకాంత్ ఓదెల

Nani: నాని నన్ను తిట్టాడు.. భయానక అనుభవాన్ని బయటపెట్టిన శ్రీకాంత్ ఓదెల

Nani: నాచురల్ స్టార్ నాని కి.. శ్రీకాంత్ ఓదెల కు బలమైన బాండింగ్ ఉంది. వీరిద్దరికి దసరా సినిమా ద్వారా అనుబంధం మొదలైంది. ఆ తర్వాత అది క్రమేపీ బలోపేతమైంది. అది ఏకంగా ది ప్యారడైజ్ సినిమా దాకా వెళ్ళింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అంతేకాదు.. శ్రీకాంత్ కోరింది మొత్తం నిర్మాత సమకూర్చారు. నాని కెరియర్ లో ది ప్యారడైజ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమాకు వ్యతిరేక కథనాలు వచ్చినప్పటికీ.. […]

Nani: నాచురల్ స్టార్ నాని కి.. శ్రీకాంత్ ఓదెల కు బలమైన బాండింగ్ ఉంది. వీరిద్దరికి దసరా సినిమా ద్వారా అనుబంధం మొదలైంది. ఆ తర్వాత అది క్రమేపీ బలోపేతమైంది. అది ఏకంగా ది ప్యారడైజ్ సినిమా దాకా వెళ్ళింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అంతేకాదు.. శ్రీకాంత్ కోరింది మొత్తం నిర్మాత సమకూర్చారు.

నాని కెరియర్ లో ది ప్యారడైజ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమాకు వ్యతిరేక కథనాలు వచ్చినప్పటికీ.. వాటిని మొత్తం తట్టుకోని నిలబడింది. ఈ సినిమాకి అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. మదర్ సెంటిమెంట్.. నాని యాక్టింగ్.. మోహన్ బాబు విలనిజం.. ఫైట్లు.. పాటలు.. కథ డిఫరెంట్ గా ఉండడంతో.. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. పైగా వరుసగా సెలవులు రావడంతో ఈ సినిమాకి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

సినిమా మీద నెగెటివిటీ వస్తున్నప్పటికీ విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో నాని.. శ్రీకాంత్.. చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో శ్రీకాంత్ సంచలన విషయాలను బయటపెట్టాడు. ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల గాసిప్స్ రకరకాల మాధ్యమాలలో పబ్లిష్ అయ్యాయి. అందులో ముఖ్యంగా నానికి.. శ్రీకాంత్ కి మధ్య గొడవలు జరిగాయని కొన్ని మీడియా సంస్థలు రాశాయి. దీనిపై కొంతమంది విలేకరులు ప్రశ్నించగా.. శ్రీకాంత్ అవును అను సమాధానం చెప్పాడు..”నాని అన్న నన్ను తిట్టింది నిజమే. ఒక సినిమా చేసేటప్పుడు తిట్టుకుంటాం. కొట్టుకుంటాం. మూతులు కూడా నాక్కొంటాం. మధ్యలో మీకెందుకు.. ఆయన నన్ను భరిస్తాడు. భరించాలి కూడా” అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.

సక్సెస్ మీట్ లో నాని ఓపెన్ గానే అన్ని విషయాలను బయట పెట్టాడు. ఇప్పుడు శ్రీకాంత్ కూడా అలానే మాట్లాడేశాడు. సినిమాకు సంబంధించి నెగెటివిటీ గురించి నాని మొహమాటం లేకుండా మాట్లాడితే.. శ్రీకాంత్ కూడా నానితో తనకు జరిగిన గొడవ గురించి బయటపెట్టాడు. ఇదంతా కూడా కావాలని జరిగింది కాదని.. సినిమా షూటింగ్లో భాగంగా జరిగిందని.. అయినా ఆ విషయాలను తమ పట్టించుకోమని శ్రీకాంత్ పేర్కొన్నాడు. సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసే వాళ్లకు నాని ఇచ్చి పడేస్తే.. శ్రీకాంత్ దాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. మొత్తానికి సినిమా ప్రచారంలో కూడా వీరిద్దరూ మరో స్థాయిని చూపిస్తున్నారు. నెగిటివ్ లో కూడా పాజిటివ్ ప్రచారం చేస్తున్నారు. తద్వారా యూత్ ఆడియన్స్ ను సినిమాకు రప్పించే ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి ఇటువంటి ప్రచారాన్ని మిగతా మేకర్స్ కూడా ఫాలో అయితే టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ మొదలయినట్టేనని చెప్పొచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper