Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: పట్టణాల్లో అత్తెసరు.. గ్రామాల్లో కొసరు.. పాపం వైసిపి..

YSRCP: పట్టణాల్లో అత్తెసరు.. గ్రామాల్లో కొసరు.. పాపం వైసిపి..

YSRCP:పట్టణ ప్రాంతాల్లో వైసిపి బలం మొన్న తేలిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో మాకు తిరుగులేదని వైసిపి నాయకులు డప్పు కొట్టుకునేవారు. అయితే అక్కడ కూడా వైసిపికి బలం లేదని తేలిపోయింది. గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలలో వైసిపి పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు.. మున్సిపాలిటీలు.. జడ్పిటిసి.. ఎంపీటీసీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని వైసిపి చవిచూసింది. ఇక ఇటీవల జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా కనీసం 25% స్థానాలను కూడా సాధించలేకపోయింది వైసీపీ. […]

YSRCP:పట్టణ ప్రాంతాల్లో వైసిపి బలం మొన్న తేలిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో మాకు తిరుగులేదని వైసిపి నాయకులు డప్పు కొట్టుకునేవారు. అయితే అక్కడ కూడా వైసిపికి బలం లేదని తేలిపోయింది. గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలలో వైసిపి పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు.. మున్సిపాలిటీలు.. జడ్పిటిసి.. ఎంపీటీసీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని వైసిపి చవిచూసింది. ఇక ఇటీవల జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా కనీసం 25% స్థానాలను కూడా సాధించలేకపోయింది వైసీపీ. ఏకగ్రీవమైన పంచాయితీల నుంచి.. ఎన్నికల జరిగిన స్థానాల వరకు దాదాపు అన్నిచోట్ల కూటమి సపోర్ట్ చేసిన వారు.. టిడిపి బలపరిచిన అభ్యర్థులు ఏకపక్షమైన విజయాలను సొంతం చేసుకున్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికలు అధికారికంగా పార్టీల గుర్తులు మీద జరగవు. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పోటీ చేసే అభ్యర్థికి ఏదో ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా మండల కేంద్రాలు.. మేజర్ గ్రామపంచాయతీలలో అసెంబ్లీ ఎన్నికలను మించి స్థానిక ఎన్నికలు జరుగుతాయి.. ప్రచారం నుంచి మొదలు పెడితే పంపకాల వరకు హోరాహోరీ వాతావరణం సాగుతూ ఉంటుంది. ఎన్నికలలో స్థానిక అంశాలకు.. కుల సమీకరణలకు కీలక ప్రాధాన్యం ఉంటుంది. గ్రామాలలో ప్రజలను ఈ ఎన్నికలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఎన్నికలు బలమైన నాయకత్వం ఏది కూడా బయటకు చెబుతాయి.

ఏపీలో తొలి విడత 3949 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 750 కి పైగా స్థానాలలో ఏకగ్రీవమయ్యాయి. ఇందులో సింహభాగం టిడిపి సపోర్టర్ల ఖాతాలోనే చేరిపోయాయి. ఇక పోలింగ్ జరిగిన 3200కి పైగా పంచాయతీల ఫలితాలను పరిశీలిస్తే మొత్తంగా ఉన్న మేజర్ పంచాయతీలలో రెండు మూడు చోట్ల మినహా మిగిలిన లో టిడిపి సపోర్టర్లు విజయం సాధించారు. వైసిపికి కంచుకోటగా చెప్పుకునే రాయలసీమ ప్రాంతాలలో ఆ పార్టీ సపోర్టర్లు గెలవడానికి తీవ్రంగా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆయనప్పటికీ అంతంతమాత్రంగానే ఫలితాలు వచ్చాయి.

గ్రామీణ ప్రాంతాలలో వైసిపికి ఈ స్థాయిలో పరాభవం ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ అధినాయకత్వం. ఒకవైపు పార్టీ అధినాయకుడు జగన్ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో కార్యవర్గానికి దూరంగా ఉంటున్నారు. స్థానిక నాయకులు కింద ఉన్న కార్యకర్తలకు అండగా నిలవడం లేదు. దీంతో వైసిపి నాయకుల్లో పూర్తిగా ఒకరకమైన నిరాశ ఏర్పడింది. అంతేకాదు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. మౌలిక సదుపాయాల కల్పన గ్రామీణ ప్రాంత ఓటర్ల మనో గతాన్ని పూర్తిగా మార్చివేశాయి. అందువల్లే అధికార పక్షం ఏకపక్షంగా విజయాలు సాధిస్తుంది. మొత్తంగా చూస్తే తొలి విడుదల జరిగిన పంచాయతీ ఎన్నికలు ఏపీ రాజకీయ భవిష్యత్తు ముఖచిత్రాన్ని మరోసారి స్పష్టంగా ఆవిష్కరించాయి. పట్టణ ఓటర్లు.. గ్రామీణ ఓటర్లు వైసీపీని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. నవంబర్ 29.. డిసెంబర్ రెండవ తేదీలో జరిగే రెండు.. మూడు విడతల ఎన్నికల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఫలితాల వల్ల వైసీపీ పునాదులు మరోసారి పూర్తిగా కదిలిపోతాయని. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆ 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper