New Zealand vs India: మొదటి టెస్టులో న్యూజిలాండ్ జట్టుకు భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేశారు. ఏకంగా ఇద్దరు ప్లేయర్లు సెంచరీల మోత మోగించారు. కానీ బౌలింగ్లో మాత్రం విఫలమయ్యారు. వికెట్లు తీయడంలో వెనుకబడ్డారు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఫలితంగా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి.
టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే కచ్చితంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగే రెండవ టెస్టు.. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టులలో విజయం సాధించాలి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం న్యూజిలాండ్ జట్టు తో రెండో టెస్టును టీమిండియా మొదలుపెట్టింది. అయితే మొదటి టెస్ట్ మాదిరిగానే టీమ్ ఇండియా ప్రారంభంలో న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించలేదు. ఓపెనర్ లాతం (59), కాన్వే (31) టీమిండియా బౌలర్లను ఎదుర్కొన్నారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 77 పరుగులు జోడించారు. ఈ దశలో గుర్నూర్ బ్రార్ కాన్వే ను వెనక్కి పంపించాడు. ఈ దశలో ప్రమాదకరమైన నికోలస్ (16) వచ్చినప్పటికీ.. అతడిని కాంబోజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (0) ఒక్క పరుగు కూడా చేయకుండా ఆకాష్ దీప్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మిచల్ (31) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఆటయ్యాడు.
వాస్తవానికి ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. ఆ తర్వాత సత్తా చూపించలేకపోయారు. బుమ్రా కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నప్పటికీ వికెట్లు తీయలేకపోతున్నాడు. ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్నూర్ బ్రార్, వాషింగ్టన్ సుందర్, కాంబోజ్ తలా ఒక వికెట్ తీశారు. ఐదు వికెట్లు తీసిన తర్వాత.. న్యూజిలాండ్ జట్టు మీద ఒత్తిడి పెంచాల్సిన సమయంలో.. భారత బౌలర్లు చేతులెత్తేయడంతో ఉపయోగం లేకుండా పోతుంది. ఈ కథనం రాసే సమయం నాటికి టామ్ బ్లండెల్ (52*), ఫిలిప్స్ (36*) క్రీజ్ లో ఉన్నారు. మీరు ఆరో వికెట్ కు ఇప్పటికే 61* పరుగులు జోడించారు. ఈ జోడిని విడగొడితేనే కివీస్ భారీ స్కోరు చేయకుండా ఉంటుంది. వీరిద్దరి తర్వాత బ్యాటింగ్ చేసేందుకు నాదన్ స్మిత్.. కైల్. జమ్మిసన్.. హెన్రీ.. జాకబ్ డఫీ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ సంచలనం సిరాజ్ లేని లోటు మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది.