Homeబిజినెస్Volkswagen Mission Efficiency : ఒక్క ఛార్జ్‌తో 805 కి.మీ.. 3 ప్రపంచ రికార్డులు సాధించిన...

Volkswagen Mission Efficiency : ఒక్క ఛార్జ్‌తో 805 కి.మీ.. 3 ప్రపంచ రికార్డులు సాధించిన వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు

Volkswagen Mission Efficiency : ఎలక్ట్రిక్ కార్లలో రేంజ్‌తో పాటు ఎనర్జీ ఎఫిషియెన్సీకి కూడా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ సరికొత్త ప్రయోగాత్మక ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ‘మిషన్ ఎఫిషియెన్సీ’ పేరుతో రూపొందించిన ఈ కారు ఉత్పత్తికి దగ్గరగా ఉన్న కాన్సెప్ట్‌గా కంపెనీ పేర్కొంది. ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను సాధించిన ఈ ప్రోటోటైప్.. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందించారు. వోక్స్‌వ్యాగన్ ID. Poloలో […]

Volkswagen Mission Efficiency : ఎలక్ట్రిక్ కార్లలో రేంజ్‌తో పాటు ఎనర్జీ ఎఫిషియెన్సీకి కూడా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ సరికొత్త ప్రయోగాత్మక ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ‘మిషన్ ఎఫిషియెన్సీ’ పేరుతో రూపొందించిన ఈ కారు ఉత్పత్తికి దగ్గరగా ఉన్న కాన్సెప్ట్‌గా కంపెనీ పేర్కొంది. ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను సాధించిన ఈ ప్రోటోటైప్.. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందించారు.

వోక్స్‌వ్యాగన్ ID. Poloలో ఉపయోగిస్తున్న MEB+ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మిషన్ ఎఫిషియెన్సీని అభివృద్ధి చేసింది. ఈ కారు ఏరోడైనమిక్ సామర్థ్యంలో కొత్త రికార్డు సృష్టించింది. దీని డ్రాగ్ కోఎఫిషియంట్ (Cd) 0.158గా ఉంది. రోడ్డుపై నడిచే కార్లలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప డ్రాగ్ కోఎఫిషియంట్ ఇదేనని వోక్స్‌వ్యాగన్ తెలిపింది.

1,278 కి.మీ ప్రయాణం.. ఆశ్చర్యకరమైన ఎఫిషియెన్సీ

ఈ ప్రోటోటైప్‌ను జర్మనీలోని వోల్ఫ్స్‌బర్గ్ నుంచి పోలాండ్, చెక్ రిపబ్లిక్ మీదుగా ఆస్ట్రియాలోని వియన్నా వరకు 1,278 కిలోమీటర్లు నడిపారు. ఈ ప్రయాణంలో కారు ప్రతి 100 కిలోమీటర్లకు కేవలం 6.89 kWh విద్యుత్‌ను మాత్రమే వినియోగించింది. ఛార్జింగ్ సమయంలో జరిగే విద్యుత్ నష్టాలను ఈ లెక్కల్లో పరిగణనలోకి తీసుకోలేదు.

అంతేకాకుండా గంటకు 68 కి.మీ. స్థిరమైన వేగంతో నిర్వహించిన మరో పరీక్షలో కేవలం 6.48 kWh/100 km వినియోగాన్ని నమోదు చేసింది. దీంతో ఎయిరోడైనమిక్ సామర్థ్యం, వాస్తవ ప్రపంచ ఎనర్జీ వినియోగం, స్థిరమైన వేగంలో ఎనర్జీ వినియోగం వంటి విభాగాల్లో మూడు రికార్డులు సాధించినట్లు కంపెనీ వెల్లడించింది.

653 కి.మీ. రేంజ్.. అనుకూల పరిస్థితుల్లో 805 కి.మీ.

మిషన్ ఎఫిషియెన్సీలో 99 kW (135 PS) ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్‌తో పనిచేస్తుంది. ఇందులో 54.9 kWh usable బ్యాటరీ ఉంటుంది. ఇది ID. Poloలోని 52 kWh బ్యాటరీ కంటే కొంచెం ఎక్కువ.

ఈ కారు 13.5 కి.మీ./kWh ఎఫిషియెన్సీని అందిస్తుందని వోక్స్‌వ్యాగన్ చెబుతోంది. గరిష్ఠంగా 653 కి.మీ. రేంజ్ అందించగలదు. అయితే వాతావరణం, రహదారి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒక్కసారి ఛార్జ్‌తో 805 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.

ప్రత్యేకమైన ఏరోడైనమిక్ డిజైన్

మిషన్ ఎఫిషియెన్సీ డిజైన్‌లో ప్రతి అంశాన్ని గాలి నిరోధకతను తగ్గించేలా రూపొందించారు. టియర్‌డ్రాప్ ఆకారంలోని బాడీ, కవర్ చేసిన వెనుక చక్రాలు, పూర్తిగా మూసివేసిన అండర్‌బాడీ వంటివి దీనికి సహాయపడతాయి. కారు ఫ్రంటల్ ఏరియా కేవలం 2.08 చదరపు మీటర్లు.

మూడు యాక్టివ్ స్లాట్లు గల ఫ్రంట్ బంపర్ గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. అలాగే నాలుగు చక్రాల లోపలి భాగంలో ప్రత్యేక రిమ్ డిఫ్లెక్టర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వీల్ ఆర్చ్‌లలో గాలి అల్లకల్లోలం తగ్గుతుంది.

చక్రాలు సాధారణంగా కారు మొత్తం ఏరోడైనమిక్ డ్రాగ్‌లో 25–30 శాతం వరకు కారణమవుతాయని వోక్స్‌వ్యాగన్ తెలిపింది. అందుకే కస్టమ్ టైర్ల కోసం కాంటినెంటల్‌తో కలిసి పనిచేసింది. ఈ టైర్ల రోలింగ్ రెసిస్టెన్స్ 4.9 kg/tonneగా ఉంది.

తక్కువ బరువు కోసం ప్రత్యేక మెటీరియల్స్

కారు బరువును తగ్గించేందుకు కార్బన్ ఫైబర్-రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో ఫ్రంట్ ఫెండర్లు, డోర్లు, బానెట్, బూట్‌లిడ్‌ను తయారు చేశారు. A-పిల్లర్ వెనుక భాగంలో అల్యూమినియం నిర్మాణాన్ని ఉపయోగించారు. ఫ్రేమ్‌లెస్ విండోలు, బాడీలోనే కలిసిపోయే డోర్ హ్యాండిల్స్ కూడా గాలి నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయి.

సోలార్ టెక్నాలజీతో రోజుకు 30 కి.మీ. అదనపు రేంజ్

మిషన్ ఎఫిషియెన్సీలో మరో ఆసక్తికరమైన ఫీచర్ 370W సోలార్ ప్యానెల్. ఇది గ్లాస్ రూఫ్, బూట్ లిడ్‌లో అమర్చారు. సీజన్, వాతావరణ పరిస్థితులను బట్టి రోజుకు 30 కి.మీ. వరకు అదనపు రేంజ్ అందించగలదని వోక్స్‌వ్యాగన్ చెబుతోంది.

నలుగురికి సరిపోయే క్యాబిన్

XL1 మాదిరిగా కేవలం ఇద్దరికి మాత్రమే కాకుండా మిషన్ ఎఫిషియెన్సీలో 2+2 సీటింగ్ లేఅవుట్ ఇచ్చారు. వెనుక భాగంలో 481 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. వెనుక చక్రాల కవర్ల వెనుక అదనపు స్టోరేజ్ కూడా అందించారు. అయితే వెనుక సీట్లలో సుమారు 1.60 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రయాణికులకు మాత్రమే సౌకర్యంగా ఉంటుంది.

కారులో బరువు తగ్గించేందుకు రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసిన మాన్యువల్ సీట్లు, చిన్న ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, థర్డ్-పార్టీ టాబ్లెట్ వంటి పరిష్కారాలను ఉపయోగించారు. సంప్రదాయ సౌండ్ సిస్టమ్ స్థానంలో బ్లూటూత్ స్పీకర్‌ను అందించారు.

మొత్తంగా చూస్తే, వోక్స్‌వ్యాగన్ మిషన్ ఎఫిషియెన్సీ ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక రేంజ్ కంటే.. తక్కువ విద్యుత్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యంపై దృష్టి పెట్టిన ప్రయోగాత్మక మోడల్‌గా నిలుస్తోంది. ఈ ప్రోటోటైప్ ఇప్పటికే యూరోపియన్ యూనియన్ రోడ్డు అనుమతులు పొందడంతో పాటు సాధారణ క్రాష్, సేఫ్టీ ప్రమాణాలను కూడా పూర్తి చేసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper