Tesla Electric vehicle : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ఒక సంచలనం సృష్టించిన టెస్లా ఇప్పుడు భారతదేశంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. టెస్లా తన మొదటి షోరూమ్‌ను ముంబైలో ప్రారంభించడం ద్వారా దేశీయ మార్కెట్‌లో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ టెస్లాకు సాదరంగా స్వాగతలం పలికారు. టెస్లా గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. టెస్లా సరైన రాష్ట్రానికి, సరైన నగరానికి వచ్చిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం టెస్లా రాకను కేవలం ఒక బిజినెస్ విస్తరణలో కాకుండా, రాష్ట్రానికి ఒక భారీ పెట్టుబడి అవకాశంగా చూస్తోంది. అందుకే టెస్లా కేవలం విక్రయాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, సప్లై చైన్స్ వంటి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్‌ను మహారాష్ట్రలోనే ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈవీ పెట్టుబడులకు మహారాష్ట్రనే ఎందుకు
మహారాష్ట్ర ప్రభుత్వం ఈవీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడానికి కారణాలున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం డైనమిక్, బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తోంది. ఈవీ తయారీదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, సబ్సిడీలను ఇస్తోంది. ఇది టెస్లా వంటి కంపెనీలకు ఆకర్షణీయమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ముంబైలో ఇప్పటికే 4 సూపర్ ఛార్జింగ్ స్టేషన్లు, 32 ఇతర ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. టెస్లా రాకతో ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. ఒక ఈవీ కంపెనీ సక్సెస్ కావడానికి ఇది అత్యంత కీలకం.
Welcome to India @Tesla
Inaugurated Tesla’s first-ever Experience Centre in India at BKC, Mumbai, today.This is not just the inauguration of an Experience Centre ; it’s a powerful statement—Tesla is here, and it’s chosen the right city and the right state: Mumbai, Maharashtra!”… pic.twitter.com/4ilfAHCEoO
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 15, 2025
మహారాష్ట్ర ఎప్పుడూ క్లీన్ మొబిలిటీ, సుస్థిరతపై దృష్టి పెడుతుంది. ఇది టెస్లా వంటి ఒక గ్లోబల్ బ్రాండ్ ఫిలాసఫీకి సరిగ్గా సరిపోతుంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఈవీ రంగంలో బజాజ్ ఆటో, టీవీఎస్ వంటి కంపెనీలు బలంగా ఉన్నాయి.
టెస్లా ఇండియాలోకి అడుగుపెట్టినా దాని ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. టెస్లా మోడల్ Y ను రూ.60 లక్షల ధరతో లాంచ్ చేసింది. ఇది చాలా మంది భారతీయ కస్టమర్లకు అందుబాటులో లేని ధర. విదేశీ మోడళ్లపై భారీ దిగుమతి సుంకాలే దీనికి ప్రధాన కారణం. టెస్లా స్థానికంగా తయారీని ప్రారంభిస్తే మాత్రమే ధరలను తగ్గించగలుగుతుంది. అంతే కాకుండా భారత మార్కెట్‌లో ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓలా వంటి కంపెనీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే మోడల్స్ కస్టమర్లకు అందిస్తున్నాయి. టెస్లా తన సొంత సూపర్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది.. దానికి చాలా సమయం పడుతుంది.
Also Read: పోకిరి సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారు…
ముంబైని టెస్లా ఎంచుకోవడం కేవలం ఒక లాంచ్ ఈవెంట్ కాదు.. ఇది భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి నాంది పలికింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్ టెస్లాకు ఒక బెస్ట్ పార్టనర్ గా నిలుస్తుందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. టెస్లా స్థానికంగా తయారీని మొదలుపెడితే, భారతదేశం ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒక గ్లోబల్ లీడర్‌గా మారడంతో బలమైన పునాది వేయగలుగుతుంది.