Robot Taxi ఒకప్పుడు డీజిల్ తో మాత్రమే కార్లు నడిచేవి. ఆ తర్వాత పెట్రోల్ వేరియంట్ వచ్చింది. ఇప్పుడు ఈవీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రను తిరగరాసే విధంగా సరికొత్త ఆవిష్కరణలు వచ్చేశాయి.
సాధారణంగా మనం ఒక వాహనం నడపాలి అంటే కచ్చితంగా స్టీరింగ్ ఉండాలి. దానిని తిప్పడానికి ఒక డ్రైవర్ ఉండాలి. పైగా వాహనం నడుతున్నప్పుడు డ్రైవర్ స్పృహలో ఉండాలి. చాలా జాగ్రత్తగా వాహనాన్ని ముందుకు కదిలిస్తూ ఉండాలి. కానీ ఇప్పటి కాలంలో ఇదంతా అవసరం లేదు.. అసలు మనిషే అవసరం లేదు.. స్టీరింగ్ తో పనిలేదు.. బండి ఎక్కామంటే దూసుకుపోవడమే.. ఎందుకంటే నయా ఆటోమొబైల్ చరిత్రలో.. కొత్త కొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత.. మనుషులు అవసరం లేకుండానే అన్ని అవసరాలు తీరిపోతున్నాయి. ఎందుకంటే మనిషికి సమయం అత్యంత విలువైనది. ఆ విలువైన సమయాన్ని మరింత గొప్పగా మార్చడానికి ఈ ఆవిష్కరణలను తీసుకొస్తున్నారు. అగ్రరాజ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా రోబో టాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రముఖ అమెజాన్ అనుబంధ సంస్థ జూక్స్ పూర్తిస్థాయిలో అటానమ స్ కారును అందుబాటులో తీసుకొచ్చింది. దీని కమర్షియల్ వినియోగానికి ఇటీవల ఆమోదం లభించింది.. ఫలితంగా ఆ సంస్థ చార్జీలు వసూలు చేసుకోవడానికి అమెరికా ఫెడరల్ రెగ్యులేటరీ వ్యవస్థ అనుమతి ఇచ్చింది.
జుక్స్ గత సంవత్సరం నుంచి లాస్ వేగాస్.. శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలలో ఉచితంగా ప్రయాణాలను అందిస్తోంది. ప్రస్తుతం అనుమతులు లభించడంతో ఇక ఈ టాక్సీ సర్వీసులు కమర్షియల్ కాబోతున్నాయి.. రోబో టాక్సీ లకు బ్రేక్ పెడల్స్ వంటివి లేకుండా అనుమతులు ఇచ్చే నిబంధనలపై నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ గత నెలలో ప్రతిపాదనలు రూపొందించింది. దీనికి ఇప్పటివరకు అనుమతులు రాలేదు. నేటి కాలంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీకి అనుగుణంగా టాక్సీలను రూపొందిస్తున్నామని ట్రాఫిక్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.
రోబో టాక్సీ పేరుకు అద్భుతమైన ప్రయాణ సాధనమైనప్పటికీ.. ఇందులో భద్రత మీద రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. స్టీరింగ్ వీల్.. ఇతర కంట్రోల్ డివైస్ లేకుండా టాక్సీ పనిచేయడం సాధ్యమేనా అని అడ్వకేట్స్ ఫర్ హైవే అండ్ ఆటో సేఫ్టీ బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రయాణ సాధనాలు సక్రమంగా నడిచే విధంగా వివరణాత్మకమైన ఆధారాలు చూపించాలని ఆ బృందం చెబుతోంది.. అమెరికాలో ఇప్పటికే కొన్ని రోబో టాక్సీలు రోడ్డు మధ్యలోనే ఆగిపోయాయి. పార్కింగ్ నుంచి బయటికి రావడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే వీటి భద్రత మీద తాము కట్టుబడి ఉన్నామని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ బృందాలు చెబుతున్నాయి.