Homeక్రీడలుక్రికెట్‌IND vs WI: వెస్టిండీస్ 247.. బీసీసీఐ తలదించుకోవాలి..

IND vs WI: వెస్టిండీస్ 247.. బీసీసీఐ తలదించుకోవాలి..

IND vs WI: మన ఇంట్లో పండగల సమయంలో నాన్ వెజ్ వండుకుంటాం. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మొత్తం ఒకే దగ్గర కూర్చొని తింటాం. ఆ సందడి వేరే విధంగా ఉంటుంది. మిగతా సమయంలో నాన్ వెజ్ వండుకున్నప్పటికీ.. ఆ స్థాయిలో అనుభూతి లభించదు. పండుగల సమయంలో అనుభూతి లభించిందని.. ప్రతిరోజు అలా కూర్చుని తినాలంటే కుదరదు. కానీ, ఈ మాత్రం ఇంగితం బిసిసిఐ పెద్దలకు లేకుండా పోతుంది. అలాగని వారేమీ నాన్ వెజ్ తినడం […]

IND vs WI: మన ఇంట్లో పండగల సమయంలో నాన్ వెజ్ వండుకుంటాం. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మొత్తం ఒకే దగ్గర కూర్చొని తింటాం. ఆ సందడి వేరే విధంగా ఉంటుంది. మిగతా సమయంలో నాన్ వెజ్ వండుకున్నప్పటికీ.. ఆ స్థాయిలో అనుభూతి లభించదు. పండుగల సమయంలో అనుభూతి లభించిందని.. ప్రతిరోజు అలా కూర్చుని తినాలంటే కుదరదు. కానీ, ఈ మాత్రం ఇంగితం బిసిసిఐ పెద్దలకు లేకుండా పోతుంది. అలాగని వారేమీ నాన్ వెజ్ తినడం లేదు. ప్రతిరోజు పండుగలాగా వ్యవహరించడం లేదు.

ఎండాకాలంలో బిసిసిఐ ఐపీఎల్ నిర్వహిస్తుంది. ఆ సమయంలో మైదానాలను ప్లాట్ గా రూపొందిస్తుంది. ఎందుకంటే చూసే ప్రేక్షకులకు మజా రావాలి కాబట్టి.. బౌలర్లు ఏమైపోయినా పర్వాలేదు.. బ్యాటర్లు వీరవిహారం చేస్తే చాలు అనుకుంటుంది. దాని వెనుక కోట్ల లెక్కలు ఉంటాయి. అంతకుమించిన వ్యవహారాలు ఉంటాయి. ఐపీఎల్ లో అంటే అలా సాగిపోతుంది. ఎందుకంటే అది క్రికెట్ లీగ్. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ల విషయాలకు వస్తే ప్లాట్ మైదానాల థియరీ వర్కౌట్ కాదు. కానీ ఐపీఎల్ ఫీవర్ నుంచి బీసీసీఐ బయటికి రావడం లేదు. అందువల్లే బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు 20 ఓవర్ల పాటు బౌలింగ్ వేసినప్పటికీ.. మూడు వికెట్లు కూడా తీయలేకపోయారంటే.. మైదానం రూపొందించిన విధానం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతగా ఫామ్ లో లేని వెస్టిండీస్ ప్లేయర్లు 20 ఓవర్లలో. జస్ట్ మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేశారంటే.. మన బౌలింగ్ ఎంత చండాలంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వెస్టిండీస్ కెప్టెన్ హోప్ 102 పరుగులు చేశాడు. అది కూడా 50 బంతుల్లో.. పైగా అతడు నాట్ అవుట్ గా నిలిచాడు. నాలుగు ఫోర్లు.. 9 సీక్సర్లు కొట్టాడు.. అండ్రు 21.. హిట్ మేయర్ 33.. పావెల్ 24 పరుగులు చేశారు. చివర్లో వచ్చిన రూథర్ఫర్డ్ 49* పరుగులు చేశాడు.

మయాంక్ యాదవ్ 4 ఓవర్లు వేసి 52 పరుగులు సమర్పించుకున్నాడు. అర్ష్ దీప్ సింగ్ నాలుగు ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్ నాలుగు ఓవర్లు వేసి, 36 పరుగులు ఇచ్చాడు. అక్షర పటేల్ 4 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చాడు. నమన్ దీర్ ఒక ఓవర్ వేసి 19 పరుగులు ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి 3 ఓవర్లు వేసి 39 పరుగులు ఇచ్చాడు.. ఇలా ఏ బౌలర్ కూడా ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపించలేకపోయారు. ఆరుగురు బౌలర్లు బౌలింగ్ వేసినప్పటికీ.. పరుగుల వరద ఆగలేదు. చివరికి హైదరాబాదులో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపినప్పటికీ కూడా ఉపయోగం లేదు. మొత్తంగా చూస్తే బీసీసీఐ చేసే పనికిమాలిన ప్రయోగాలు.. బౌలర్ల పాలిట శరాఘాతంలాగా మారిపోయాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper