IND vs WI: వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా ఇప్పటికే ట్రోఫీ గెలిచింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి అదరగొట్టింది. ముఖ్యంగా రెండో వన్డేలో 400 పైగా పరుగుల లక్ష్యాన్ని చేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియా కెప్టెన్ గిల్ ఏకంగా డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు.
వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన నేపథ్యంలో.. టీమిండియా వీర లెవెల్లో ఉత్సాహంలో ఉంది. ఇదే ఉత్సాహంతో చివరిదైన మూడో వన్డేలో ఆడుతోంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే డబుల్ సెంచరీ హీరో గిల్ మైదానమైన చండీగఢ్లో మాత్రం తేలిపోయాడు. విరాట్ కోహ్లీ అయితే 0 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా కేవలం నాలుగు పరుగు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రుతు రాజ్ గైక్వాడ్ (57), రోహిత్ శర్మ (92) అదరగొట్టారు. వీరిద్దరూ మూడో వికెట్ కు ఏకంగా 137 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్ శర్మ 92 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో టీమ్ ఇండియా అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
విరాట్ కోహ్లీ 0 పరుగుల వద్ద ఔట్ అయినప్పుడు.. గిల్ ఒక పరుగు మాత్రమే చేసి పెవీలియన్ వెళ్ళినప్పుడు.. మైదానంలో అభిమానులు తీవ్రంగా కలత చెందారు. అయితే వారిద్దరూ లేని లోటును రోహిత్ శర్మ భర్తీ చేశాడు. కానీ సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయ్యాడు. 10 ఫోర్లు.. మూడు సిక్సర్లు కొట్టి తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ. ఇక ఈ కథనం రాసే సమయం వరకు టీమిండియా 34.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి, 214 పరుగులు చేసింది.. కేఎల్ రాహుల్ 39, నమన్ దీర్ 22 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు..
రోహిత్ శర్మ సెంచరీ చేస్తే పండగ చేసుకుందామని అభిమానులు అనుకున్నారు. ఎప్పుడైతే అతడు సెంచరీకి దగ్గరగా వచ్చాడో మైదానంలో కేరింతలు మొదలయ్యాయి.. అయితే అతడు 92 పరుగుల వద్ద పాల్ బౌలింగ్లో ఆండ్రు కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మైదానం నుంచి నిరాశగా వెళ్లిపోయాడు. ఒకవేళ అతడు గనుక సెంచరీ చేసి ఉంటే మైదానం ఒకరకంగా ఉండేది. శబ్దాలతో హోరెత్తిపోయేది. కానీ రోహిత్ సెంచరీ చేయలేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
So easy on the eye
Glimpses of that crucial 1️⃣3️⃣7️⃣-run partnership between @ImRo45 and @Ruutu1331
Updates ▶️ https://t.co/PhSJSbvW7C#TeamIndia | #INDvWI | @mflone_ pic.twitter.com/AcdeSWZvY8
— BCCI (@BCCI) October 3, 2026