Homeక్రీడలుక్రికెట్‌IND vs WI: మూడో టి20లో ప్రిన్స్ యాదవ్ హాట్ టాపిక్.. గూగుల్ ట్రెండ్స్ లో...

IND vs WI: మూడో టి20లో ప్రిన్స్ యాదవ్ హాట్ టాపిక్.. గూగుల్ ట్రెండ్స్ లో ఎందుకింత చర్చ..

IND vs WI: టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడవ టి20 జరుగుతోంది. ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి ప్రిన్స్ యాదవ్ వచ్చాడు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ మంచి మొదలు పెడితే అయ్యర్ వరకు ఆడుతున్నప్పటికీ.. ప్రిన్స్ యాదవ్ పేరునే అందరూ కలవరిస్తున్నారు.. ప్రఖ్యాత గూగుల్ ట్రెండ్స్ లో అతడి పేరు మారుమోగిపోతోంది. బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం ఇతడి నైజం మూడో టి20 మ్యాచ్లో ప్రిన్స్ యాదవ్ మీద అభిమానులకు […]

IND vs WI: టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడవ టి20 జరుగుతోంది. ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి ప్రిన్స్ యాదవ్ వచ్చాడు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ మంచి మొదలు పెడితే అయ్యర్ వరకు ఆడుతున్నప్పటికీ.. ప్రిన్స్ యాదవ్ పేరునే అందరూ కలవరిస్తున్నారు.. ప్రఖ్యాత గూగుల్ ట్రెండ్స్ లో అతడి పేరు మారుమోగిపోతోంది.

బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం ఇతడి నైజం

మూడో టి20 మ్యాచ్లో ప్రిన్స్ యాదవ్ మీద అభిమానులకు ఇష్టం ఏర్పడింది. వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్లో అతడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్ భారత క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న యువ ఫాస్ట్ బౌలర్. ప్రిన్స్ యాదవ్ 12 డిసెంబర్ 2001లో పుట్టాడు. ఢిల్లీ ఇతడి స్వస్థలం. కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్ ఇతడి శైలి. ఐపీఎల్ లో లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. వేగంతో పాటు బంతిని పిచ్ పై బలంగా వేసి, అదనపు బౌన్స్ రాపట్టడం.. బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం ఇతడి నైజం.

టెన్నిస్ బాల్ నుంచి టీమ్ ఇండియా వరకు

ప్రిన్స్ యాదవ్ ఢిల్లీ సమీపంలో దరియా పూర్ కర్గ్ గ్రామంలో పుట్టాడు. ఇతడు టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడేవాడు. తద్వారా తన క్రికెట్ ప్రయాణాన్ని టెన్నిస్ బాల్ ద్వారా మొదలుపెట్టాడు. మొదట్లో ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకోలేదు. క్రికెట్ ను అదేపనిగా ఆడి, ఢిల్లీ దేశవాళి క్రికెట్లో ప్రవేశించాడు. బౌలింగ్ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024- 25 కాలంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 వికెట్లు సాధించాడు. ఇది ఇతడి కెరీర్ మొత్తాన్ని మార్చేసింది.

ఐపీఎల్ లో ప్రదర్శన

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో మొత్తం 14 మ్యాచ్లు ఆడాడు. 16 వికెట్లు పడగొట్టాడు. 3/32 అత్యుత్తమ ప్రదర్శనగా నమోదు చేశాడు.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జట్టులో నిలిచాడు. ఇతను బౌలింగ్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీని బౌల్డ్ చేసిన విధానం. వేగంగా వచ్చిన బంతిని బ్యాట్ ను అధిగమించి వికెట్లను తాకడం.. ఇతని కెరియర్లో మర్చిపోలేనిది..

మూడో టి20లో అవకాశం ఎందుకంటే

భారత్ వెస్టిండీస్ మధ్య మూడో టి20 లో యాదవ్ కు తుది జట్టులో చోటు లభించింది. కులదీప్ యాదవ్ స్థానంలో ఇతడిని జట్టులోకి తీసుకున్నారు. శివం దుబే స్థానంలోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. వేగంగా బంతులు వేసే బౌలర్లకు ఇక్కడ కఠినమైన పరీక్ష ఎదురవుతుంది. డెత్ ఒవర్లలో యార్కర్లు వేయగల సామర్థ్యం కూడా ప్రిన్స్ యాదవ్ కు ఉంది. అందువల్లే అతడిని మూడవ టి20 మ్యాచ్లోకి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మూడో టి20 లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (69) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper