Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చాలా పరణతితో రాజకీయాలు చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రాజకీయాలు చేసిన మహా రాజకీయ నేతలను గుర్తుచేస్తున్నాడు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చెప్పని విధంగా ప్రభుత్వంలో జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పడం సంచలనమైంది.
వైసీపీ ఎంత రాజకీయంగా వాడుకుందామనిచూసినా జనం నమ్మేలాలేరు. వైసీపీ హయాంలో లాగా అవినీతికి చోటు లేకుండా పాలన లోపంతో జరిగితే సరిదిద్దలేదు.కానీ పవన్ ఇప్పుడు ప్రక్షాళన చేయడానికి నిర్ణయించడం హర్షనీయం.
కాకినాడలో ఇవ్ టీజర్లకు చోటులేదు. నేరస్థులకు కులం, మతం లేదని స్పష్టంచేశారు. పవన్ తీరు యోగి ఆధిత్యనాత్ ను గుర్తుచేస్తోంది. మోహమాటం లేకుండా స్ట్రెయిట్ గా పోలీస్ అధికారులకు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్, తిరుపతి, కాకినాడల్లో స్పందించినతీరు వినూత్నంగా ఉంది. తప్పు జరిగినప్పుడు కేవలం అధికారుల మీద తోసేయకుండా క్షమాపణలు చెప్పడం తన ఔన్నత్యాన్ని తెలియజేస్తోంది. రైల్వే యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. ఒకరిపై తోసేయకుండా తనకు తాను క్షమాపణ చెప్పడం హర్షించదగ్గ విషయం.
అపచారానికి తప్పుకు తేడా తెలియని విమర్శలు.. పవన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.