Pawan Kalyan : పవన్ కళ్యాణ్, తిరుపతి, కాకినాడల్లో స్పందించినతీరు వినూత్నంగా ఉంది. తప్పు జరిగినప్పుడు కేవలం అధికారుల మీద తోసేయకుండా క్షమాపణలు చెప్పడం తన ఔన్నత్యాన్ని తెలియజేస్తోంది. రైల్వే యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. ఒకరిపై తోసేయకుండా తనకు తాను క్షమాపణ చెప్పడం హర్షించదగ్గ విషయం.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై చాలా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసాడు. ఈ ఘటనపై ప్రభుత్వం తరుపున బాధ్యత వహిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ఈ దుర్ఘటన కి ప్రభుత్వం తరుపున బాధ్యత వహిస్తూ, మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ క్షమించమని కోరుతున్నాను. ఈ దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకోవడం నా హృదయాన్ని కలిచివేసింది. ఎంతో ఆనందంతో కొత్త సంవత్సరంలో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇలాంటి సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అత్యంత శోచనీయం. ఈ ఘటన పై ఆరా తీసి అందుకు కారణమైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుంటాము. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటాము’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
కాకినాడలో వేసిన చురకలు బాధ్యతల్ని గుర్తు చేసాయి.. పవన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.