HomeతెలంగాణShreshthi Varma: బిజెపి కార్యాలయానికి కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ.. జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి..

Shreshthi Varma: బిజెపి కార్యాలయానికి కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ.. జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి..

Shreshthi Varma: అప్పట్లో కొరియోగ్రాఫర్ జానీ మీద శ్రేష్టి వర్మ అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది గుర్తుంది కదా. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ చాలా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో ఆయనకు అవకాశాలు లేకుండా పోయాయి. చాలా రోజులపాటు ఆయన తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలిచారు. ఆ తర్వాత వచ్చిన అభియోగాలు మొత్తం ఒక్కొక్కటిగా తొలగిపోవడంతో జానీ మాస్టర్ ఊపిరి పీల్చుకున్నారు. నాడు జానీ మాస్టర్ […]

Shreshthi Varma: అప్పట్లో కొరియోగ్రాఫర్ జానీ మీద శ్రేష్టి వర్మ అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది గుర్తుంది కదా. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ చాలా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో ఆయనకు అవకాశాలు లేకుండా పోయాయి. చాలా రోజులపాటు ఆయన తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలిచారు. ఆ తర్వాత వచ్చిన అభియోగాలు మొత్తం ఒక్కొక్కటిగా తొలగిపోవడంతో జానీ మాస్టర్ ఊపిరి పీల్చుకున్నారు.

నాడు జానీ మాస్టర్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన శ్రేష్ఠి వర్మ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బిజెపి పెద్దలతో మంతనాలు జరిపారు. అనంతరం ఆమె బిజెపి కండువా కప్పుకున్నారు. శ్రేష్ఠి వర్మ బీజేపీలో చేరడంతో ఒక్కసారిగా సంచలనం నమోదయింది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేసిన తర్వాత.. శ్రేష్టి వర్మ కొద్దిరోజులపాటు నిశ్శబ్దంగా ఉంది. ఆ తర్వాత కొరియోగ్రఫీ చేసుకుంటూ వెళ్ళింది. జానీ మాస్టర్ మళ్లీ బయటికి రావడం.. సినిమాలలో పని చేయడం మొదలుపెట్టగానే శ్రేష్టి వర్మ యాక్టివ్ అయింది.

జానీ మాస్టర్ మీద పరోక్షంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. రియాల్టీ షోలో కనిపించింది. ఇప్పుడు ఏకంగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకుంది. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే బిజెపిలో చేరినట్టు సమాచారం. ఇప్పటికే మాధవి లత.. ఇంకా కొంతమంది సినీ రంగానికి సంబంధించిన వారు బిజెపిలో చేరారు. ఇప్పుడు వారితోపాటు శ్రేష్టి వర్మ కూడా బిజెపి కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో బీజేపీ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రజా సమస్యల మీద పోరాడుతుంది. శ్రేష్టి వర్మ బిజెపిలో చేరింది కాబట్టి.. జానీ మాస్టర్ మీద పగ తీర్చుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తుందా.. ఎందుకంటే అతడు త్వరగానే బయటికి వచ్చాడు . అప్పటినుంచి శ్రేష్టి వర్మ పగతో రగిలిపోతూనే ఉంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే పవన్ కళ్యాణ్ దగ్గర కాబట్టి.. జానీ మాస్టర్ మీద పగ తీర్చుకునే అవకాశం ఇస్తాడా.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper