Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళం లోనే కాదు , తెలుగు లో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘జైలర్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న రజినీకాంత్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోయింది ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రేంజ్ వసూళ్ల సునామీని సృష్టించిన సినిమా కి సీక్వెల్ కాబట్టే , ‘జైలర్ 2’ పై మార్కెట్ లో ఈ స్థాయి క్రేజ్ ఉంది.
ఇదంతా పక్కన పెడితే, ‘జైలర్’ చిత్రానికి అంతటి క్రేజ్ రావడానికి , ఆ సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి అనిరుద్ అందించిన మ్యూజిక్ చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో అనేక సన్నివేశాలకు జీవం పోసింది. థియేటర్స్ లో ఆడియన్స్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ మూమెంట్స్ ని అందించింది. ‘జైలర్ 2’ కి కూడా అనిరుద్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదు. గ్లింప్స్ వీడియో కి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియా ని షేక్ చేసింది. ఇప్పటికీ ఆ థీమ్ మ్యూజిక్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇకపోతే రెండు రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్. ‘అలా బొలెలో’ అంటూ సాగే ఈ పాట ప్రోమో కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా పూర్ణ వేసిన డ్యాన్స్ స్టెప్పులు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కాసేపటి క్రితమే పూర్తి పాటని విడుదల చేశారు మేకర్స్. అయితే పూర్తి పాట విన్న తర్వాత ఎందుకో ఇది అనిరుద్ రేంజ్ కి తగ్గ ట్యూన్ కాదని అనిపించింది. ‘జైలర్’ చిత్రం ‘రావాలయ్యా’ అనే పాటకు ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి భారీ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టేందుకు ఆ పాట చాలా ఉపయోగపడింది. ఆ రేంజ్ లో నేడు విడుదలైన ‘అలా బొలెలో’ పాట లేదనే చెప్పాలి. పూర్ణ డ్యాన్స్ అదరగొట్టేసింది , జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు కూడా అదిరిపోయాయి. కానీ మ్యూజిక్ మాత్రం అంచనాలను అందుకోలేదు. కానీ రాబోయే రోజుల్లో ఈ పాట కూడా జనాల్లోకి బాగా వెళ్లే అవకాశం ఉంది , ఎందుకంటే అనిరుద్ క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది మరీ.