Nani: నాని హీరోగా కాయదు లోహర్ హీరోయిన్ గా.. మోహన్ బాబు.. సంపూర్ణేష్ బాబు.. ప్రియదర్శి కీలకపాత్రలో నటించిన ది ప్యారడైస్ సినిమా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. గుర్తింపు కోసం పోరాటం చేసే సవారి వర్గాల చరిత్రను ఈ సినిమా గా రూపొందించారు.
ఈ సినిమాపై విపరీతంగా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. సినిమాలో హింస అధికంగా ఉందని.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సాగదిత లాగా ఉందని.. మోహన్ బాబు పాత్ర సరిగ్గా లేదని.. సినిమాను ఫస్ట్ ఆఫ్ లోనే ముగించారని.. సెకండ్ హాఫ్ లో ఎలా తీయాలో తెలియక ఏదో అలా ముగించారని.. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. కొందరు స్వయం ప్రకటిత విశ్లేషకులు సినిమా మీద నెగిటివ్ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. నాని కెరియర్లో ఇంతటి హింసాత్మకమైన సినిమాను చూడలేదని.. నాని ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమైపోతున్నాడని.. వ్యాఖ్యలు చేశారు.
నెగిటివిటీ ఎలా ఉన్నప్పటికీ.. ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నది. బుక్ మై షో లో ఈ కథనం రాసే సమయం వరకు గడచిన గంట సమయంలో 16.1 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. దీనిని బట్టి ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా మీద నెగెటివిటీ ఎలా ఉన్నప్పటికీ.. సినిమా చూసేందుకు చాలామంది వస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా హీరో నాని.. దర్శకుడు శ్రీకాంత్.. వంటివారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఇంత నెగిటివిటీని తట్టుకొని నిలబడ్డం అంటే మాటలు కాదు. ఈ స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో ఈ సినిమాకు వచ్చిన మౌత్ టాక్ ఏ సినిమాకు రాలేదు. 2026 లో ఈ స్థాయిలో ఘనత దక్కించుకున్న సినిమా ముమ్మాటికి ప్యారడైజ్ అని చెప్పగలను. నెగిటివిటీ ప్రసారం చేస్తున్నారు. పాజిటివిటీని కొంత పరిధిలో మాత్రమే ప్రసారం చేస్తున్నారు. అయినప్పటికీ ఇబ్బంది లేదు. ఈ రోజుల్లో గుడ్ అనేది లేదు. బ్యాడ్ అనేది అంతకంటే లేదు. కేవలం సౌండ్ మాత్రమే ఉంది. 2026 లో మోస్ట్ నాయిస్ ఫిల్మ్ ఇదే.. సినిమాలు కొత్తగా తీశామని అనుకున్నాం. కానీ రియాక్షన్ కూడా కొత్తగానే ఉంటుందని అనుకోలేదు. తెలుగు వాళ్ళు గ్రేటెస్ట్ ఆడియన్స్. వాళ్లకు రుణపడి ఉంటానని” నాని వ్యాఖ్యానించాడు.
అయితే ఈ సక్సెస్ మీట్ లో నాని ఎవరి మీద ఎటువంటి విమర్శ చేయలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాజిటివిటీ.. నెగెటివిటీ గురించి మాట్లాడిన నాని.. ప్రెస్ మీట్ లో మాత్రం చాలా సానుకూలంగా మాట్లాడారు. సినిమా గురించి గొప్పగా చెప్పారు. సినిమా గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారి గురించి నాని ప్రస్తావించలేదు. కేవలం తను చెప్పాల్సిన విషయాన్ని మాత్రమే చెప్పగలిగారు. తద్వారా నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవాళ్ళు తన దృష్టిలో దేనికి పనికిరారు అని నాని సింబల్ ఇచ్చేశాడు. ఇదే విషయాన్ని నాని అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఒక్క సక్సెస్ మీట్ ద్వారా తన సినిమా ప్రచారాన్ని మరో లెవల్లో నిర్వహించాడు.
#TheParadise Premier Night నెగటివ్ Talk .. Morning కి పాజిటివ్ టాక్
:- Natural Star #Nani pic.twitter.com/TsW4VPMmva
— Milagro Movies (@MilagroMovies) September 26, 2026