Homeఅంతర్జాతీయంUS And Israel: ఇండియాలో పోస్టు.. అమెరికా, ఇజ్రాయెల్‌ షేక్‌!

US And Israel: ఇండియాలో పోస్టు.. అమెరికా, ఇజ్రాయెల్‌ షేక్‌!

US And Israel: అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌తో మొదలు పెట్టిన యుద్ధం కొలిక్కి రావడం లేదు. ఇదే సమయంలో యుద్ధం నుంచి బయటపడేందకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో తాత్కాలిక శాంతి ఒప్పందాలు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ చేసిన కుట్ర ఇటీవల బయటపడింది. దీంతో యావత్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా భారత్‌లో సోషల్‌ మీడియాలో చేసిన ఒక పోస్టు అగ్రరాజ్యం అమెరికాను, దాని మిత్ర దేశం ఇజ్రాయెల్‌ ఉలిక్కిపడేలా […]

US And Israel: అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌తో మొదలు పెట్టిన యుద్ధం కొలిక్కి రావడం లేదు. ఇదే సమయంలో యుద్ధం నుంచి బయటపడేందకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో తాత్కాలిక శాంతి ఒప్పందాలు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ చేసిన కుట్ర ఇటీవల బయటపడింది. దీంతో యావత్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా భారత్‌లో సోషల్‌ మీడియాలో చేసిన ఒక పోస్టు అగ్రరాజ్యం అమెరికాను, దాని మిత్ర దేశం ఇజ్రాయెల్‌ ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలతో పాటు నకిలీ సమాచారం, మీమ్‌లు కూడా ప్రధాన వార్తలుగా మారుతున్నాయి. భారత్‌లోని ఒక ఎక్స్‌ ఖాతా ద్వారా వచ్చిన ఒక పోస్టు ఇజ్రాయెల్, అమెరికా వర్గాలను గందరగోళానికి గురిచేసింది.

ఆగస్టు 5న వైరల్‌..
ఆగస్టు 5న ఒక భారతీయ ఎక్స్‌ ఖాతాలో ఇరాన్‌ అణు కార్యక్రమం సంబంధించిన కంటెంట్‌ పోస్టు చేశాడు. ఐఆర్‌జీసీ కమాండర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ అహ్మద్‌ వాహిది మాట్లాడుతూ, ఇజ్రాయెల్, అమెరికా అణ్వాయుధాలు కలిగి ఉన్నంతవరకు ఇరాన్‌ తన అణు ప్రయత్నాలను విరమించుకోదని చెప్పినట్లు అందులో పేర్కొనబడింది. అతని ఫోటోతోపాటు అణు పరీక్ష సమయంలో వెలువడే పొగతో కూడిన ఏఐ ఫొటో ఈ జోస్టుకు జత చేశాడు. ఇది వేగంగా వ్యాప్తి చెందింది. వైరల్‌ అయింది.

ఇజ్రాయెల్, అమెరికా ఉలికిపాటు..
ఇజ్రాయెల్‌ మీడియా ఈ ప్రకటనను ఐఆర్‌జీసీ కమాండర్‌ చేసినట్లు ప్రసారం చేసింది. ఇరాన్‌ తొలిసారిగా అణుబాంబు తయారీని బహిరంగంగా అంగీకరించినట్లు వారు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా స్పందిస్తూ, ఇరాన్‌ ఉద్దేశాలను ఇది నిరూపిస్తుందని అన్నారు. ఐరాసలో అమెరికా రాయబారి మైక్‌ వాల్టŠజ్‌ ఆ పోస్టును షేర్‌ చేశారు. సెనెటర్‌ రిక్‌ స్కాట్‌ కూడా దీనిని పంచుకున్నారు. అమెరికా ప్రధాన మీడియాలో కూడా దీనిపై కథనాలు వచ్చాయి.

ఇరాన్‌ స్పందన..
తర్వాత ‘ది టైమ్స్‌’ ఈ విషయాన్ని పరిశీలించి అసత్య సమాచారంగా నిర్ధారించింది. ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ దీనిపై స్పందిస్తూ, తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఇది ఉదాహరణగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ఇజ్రాయెల్‌ కుట్ర ఉందని ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా ఇరాన్‌పై సైనిక చర్యను సమర్థించుకోవడానికి ఇలాంటి ప్రచారం జరుగుతోందని ఆయన విమర్శించారు.

ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు సాకుగా చూపుతున్నాయి. టెహ్రాన్‌ మాత్రం యురేనియం శుద్ధి కేవలం పౌర అవసరాలకోసమేనని పదేపదే చెబుతోంది. ఫేక్‌గా తేలిన తర్వాత మైక్‌ వాల్ట్‌జ్‌ తన పోస్టును తొలగించడం గమనార్హం. ఈ సంఘటన నకిలీ వార్తలు అంతర్జాతీయ ఉద్రిక్తతలను ఎలా పెంచుతాయో స్పష్టం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper